‘నెపోలియన్‌’ ట్రైలర్‌ విడుదల

NEPOLIAN-1
NEPOLIAN

‘నెపోలియన్‌’ ట్రైలర్‌ విడుదల

ఆచార్య క్రియేషన్స్‌ , ఆనంద్‌ రవి కాన్సెప్ట్‌ బ్యానర్స్‌పై రూపొందుతున్నచిత్రం ‘నెపోలియన్‌ . ఆనంద్‌ రవి దర్శకుడు. భోగేంద్ర గుప్త మండుపల్లి నిర్మాత.. ఈసినిమా ట్రైలర్‌ను బుధవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్స్‌లో విడుదల చేశారు.. కెఎల్‌ దామోదర్‌ ప్రసాద్‌, హీరో సందీప్‌కిషన్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు.. కార్యక్రమంలో నిర్మాత భోగేంద్ర గుప్తాకు చెందిన ట్రిపుల్‌ ఎస్‌ అనే ఎన్‌జిఒ సంస్థ అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్టు వరప్రసాద్‌కు రూ.25 వేల చెక్కును అందజేశారు. ఈచెక్‌ను సీనియర్‌పాత్రకేయులు బిఎ రాజు, పసుపులేటి రామారావు అందుకున్నారు.
కెఎల్‌ దామోదర్‌ప్రసాద్‌ మాట్లాడుతూ, సినిమా గురించి చెప్పాలంటే టెక్నికల్‌గా మంచి సినిమా అన్నారు. నటీనటులు చక్కగా ఫెర్ఫామ్‌ చేసినట్టు కనపడిందన్నారు. ఆనంద్‌ రవి చాలా పరిణితితో సినిమాచేసినట్టు తెలుస్తోందన్నారు.. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని అని అన్నారు.
సందీప్‌కిషన్‌ మాట్లాడు ప్రతినిధి సినిమా తానుచేయాల్సింది అని కానీ కుదరలేదని తెలిపారు. తదుపరి మూవీ అయినా చేయాలనుకుంటున్నట్టు తెలిపారు.. రవన్న సినిమా కథలన్నీబాగుంటాయని అన్నారు.. కార్యక్రమంలో నిర్మాత భోగేంద్ర గుప్తా మడుపల్లి, ఆనంద్‌ రవి, లక్ష్మీభూపాల్‌, కోమలి, మ్యూజిక్‌ డైరెక్టర్‌ సిద్ధార్త సదాశివుని తదితరులు మాట్లాడారు. ఆనంద్‌రవి, కోమలి, రవివర్మ, కేదార్‌ శంకర్‌, మధుమణి, అల్లు రమేష్‌ ప్రధాన తారాగణం.