నెగెటివ్‌ పాత్రలో గోపీచంద్‌

Gopichand Movie
Gopichand Movie

నెగెటివ్‌ పాత్రలో గోపీచంద్‌

హీరోలు నెగెటివ్‌ ఛాయలున్న పాత్రలు చేయడానికి భయపడతారు. నటుడిగా అన్ని పాత్రలు చేయాలనే గోపీచంద రెండు పాత్రలను పోషించాడు. తను ఇంతుకుముందు నెగెటివ్‌ పాత్రలు పోషించిన అనుభవముందని దిల్‌రాజు అన్నారు. గోపీచంద్‌ నటించిన గౌతమినంద చిత్రం టీజర్‌ ఆవిష్కరణలో ఆయన మాట్లాడారు. హన్సిక, కాగీథరిన్‌ హీరోయిన్లుగా నటించారు. సంపత్‌ నంది దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ ఆర్టిస్టుగా ఏదైనా చేయగలనంటేనే రచయితలు కథలు రాస్తారు. దర్శకుడు సంపత్‌ మూడు సినిమాలు వేటికమే భిన్నమనవి చేశాడు. 15 రోజులనాడే టీజర్‌ చూశాను. బాగా కట్‌చేశాడు. గోపీచంద్‌ రెండు పాత్రల్లో బాగా నటించాడు. వచ్చే నెలలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారని తెలిపారు. గోపీచంద్‌ మాట్లాడుతూ నటనకు ఆస్కారమున్న కథ ఇది. శంఖం నిర్మిచిన నిర్మాతలే ఈ సినిమాను చేశారు. త్వరలో సినిమా విడుదలకానున్నదని తెలిపారు. సంపత్‌నంది తెలుపుతూ రచ్చ, బెంగాల్‌ టైగర్‌ హీరోలను బట్టి కథ రాసుకున్నాను. గౌతమినందకు మాత్ర కథనుబట్టే హీోను ఎంపిక చేశాను. హీరో లుక్‌ కొత్తగా ఉంటుందని తెలిపారు. నిర్మాతలు జె.భగవాన్‌, జె.పుల్లారావ్ఞ మాట్లాడుతూ టీజర్‌ కంటే సినిమా చాలా బాగుంటుంది. రెండు పాటలు బ్యాలెన్స్‌ పూర్తిచేసి వచ్చేనెలలో సినిమాను విడుదల చేస్తామని తెలిపారు.