నెక్ట్స్‌ మూవీ కోసం కొత్త లుక్‌

Allu Arjun
Allu Arjun

నెక్ట్స్‌ మూవీ కోసం కొత్త లుక్‌

డిజె విజయం తర్వాత స్టైలిస్‌స్టార్‌ అల్లు అర్జున్‌ చేస్తున్న చిత్రం ‘ నా పేరుసూర్య – నా ఇల్ల ఇండియా.. పై అభిమానుల్లో , సినీ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ నెలకొంది.. రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా మారుతూ మొదటి ప్రాజెక్టుగా ఈసినిమాను డైరెక్టుచేయనున్నారు.. దేశ భక్తి నేపథ్యంలోరూపొందనున్న ఈ సినిమాలో బన్నీ ఒక మిలిటరీ ఆఫీసర్‌గా కన్పింబోతున్నారు.
సినిమాలోని కథను, పాత్ర స్వభావాన్ని బట్టి ఎప్పటికపుడు కొత్త లుక్‌ మార్చే అల్లు అర్జున్‌ ఈసినిమాలో మిలిటరీ ఆఫీసర్‌గా కన్పించేందుకు భారీ ప్లాన్‌ రెడీ చేసుకున్నారనట.. అందులో భౄగంగా ఫిజికల్‌ఫిట్నెస్‌ కోసం నెల పాటు యుఎస్‌ వెళ్లి కఠినమైన శిక్షణ తీసుకోనున్నారు.. దీనికోసం ఈ వారాంతంలో ఆయన యుఎస్‌ బయలుదేరి వెళ్లనున్నారు..బన్నీ ట్రై చేయబోయే లుక్‌ మునుప్నెడూ చూడని విధంగా సరికొత్తగా ఉంటుంది తెలుస్తోంది.. 2018 సంక్రాంతికి విడుదల కానున్న ఈసినిమాకు విశాల్‌-శేఖర్‌ సంగీతం, ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ రాజీవ్‌ రవి కెమెరా వర్త్‌ చేయనుండగా, బన్నీ సరసన అనూ ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.