నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌కు సెంట‌ర్ ఆఫ్ ఎక్స్లెన్స్ వేదిక కానుందిః లోకేశ్

lokesh copy
lokesh

అమరావతి: హనీవెల్ కంపెనీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అక్షయ్, ప్రతినిధులు గురువారం మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. ఈ సంద‌ర్భంగా లోకేశ్ మాట్లాడుతూ త్వరలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ ఏర్పాటు చేస్తామని, సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ ఏర్పాటు సహకారం అందించాలని హాని వెల్ ప్రతినిధులను మంత్రి కోరారు. వ్యవసాయంలో వచ్చే నూతన ఆవిష్కరణలకు సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ వేదికకానుందని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ తెలిపారు.