నూతన నటీనటులతో ‘ప్రభాస్‌’ ప్రారంభం

A Still From PRABHAS
A Still From PRABHAS

నూతన నటీనటులతో ‘ప్రభాస్‌’ ప్రారంభం

ఫార్ట్యూన్స్‌ మూవీస్‌ పతాకంపై నూతన నటీనటులను తెలుగు తెరకు పరిచయం చేస్తూ దర్శకుడు సాగర్‌ చాలా కాలం తర్వాత దర్శకత్వం చేస్తున్న చిత్రం ‘ప్రభాస్‌. శుక్రవారం ఉదయం అన్నపూర్ణస్టూడియోస్‌లోజరిగింది.. ఎఫ్‌బిసి చైర్మన్‌ రామ్‌మోహన్‌ క్లాప్‌ ఇచ్చారు. కెమెరాను కెఎస్‌ ప్రకాశరావు స్వీచ్ఛాన్‌ చేయగా, ఎస్వీకృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్రం దర్శకుడు సాగర్‌ మాట్లాడారు.. నేను ఇంతవరకు 30 సినిమా చేశానన్నారు.. చాలా గ్యాప్‌ తర్వాత ఒక డిఫనెంట్‌ జోనర్‌ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందన్నారు.. హీరో నితీష్‌రెడ్డి చైల్డ్‌ ఆర్టిస్టుగా మనందరికీ సుపరిచితమని, ప్రస్తుతం తమిళ, కన్నడ భాషల్లో హీరోగా గుర్తింపుసంపాదించుకున్నారన్నారు.. ఇక నూతన హీరోయిన్స్‌ను పరిచయం చేయటానికి కారణం వీలైతే చిత్రీకరణ , పబ్లిసిటీ సమయంలో అనుకూలంగా ఉంటూ సపోర్ట్‌ చేయగలుగుతారన్నారు. సీనియర్‌ హీరోయిన్ల డేట్స్‌ప్రాబ్లమ్‌ కారణంగా ఈ నిర్ణయం తీసుకోవటం జరిగిందన్నాఉ. షూటింగ్‌ దీపావళి నుంచి ప్రారంభిస్తామన్నారు..
హీరో నితీష్‌రెడ్డి మాట్లాడుతూ, మగ మహారాజు, రేపటి పౌరులు సినిమాలో పిఎల్‌నారాయణ గారి కొడుకుగా నేను నటించిన బడికివెళ్తాఅనే పాత్రలో నటించి చైల్డ్‌ ఆర్టిస్టుగా గుర్తింపు పొందానన్నారు.. ప్రస్తుతం కన్నడ , తమిళ, మలయాళ చిత్రాల్లో హీరోగా నటించిన సినిమాలు విజయవంతమయ్యాయన్నారు. మంచి కథ కలిగిన దర్శకత్వంలో తెలుగులోపరిచయం కావటం సంతోషంగా ఉందన్నారు.. నిర్మాత అశోక్‌మాట్లాడుతూ, దర్శకుడు సాగర్‌గారు చెప్పిన స్టోరీ నచ్చటంతో సినిమా చేయటానికి అంగీకరించటం జరిగిందన్నారు. నితీష్‌కుమార్‌రెడ్డి, అమృత, నదిని ముఖ్యతారాగణం..