నువ్వుల బిస్కెట్‌

BISCUITS
BISCUITS

నువ్వుల బిస్కెట్‌

కావలసినవి
వనస్పతి లేక మార్గరిన్‌ -225గ్రా మైదా-375గ్రా, గుడ్డు-1 పంచదారపొడి-170గ్రా కార్న్‌ఫ్లోర్‌-15గ్రా నువ్ఞ్వలు-20గ్రా బేకింగ్‌ పౌడర్‌-5గ్రా వెనిల్లా ఎసెన్స్‌-కొన్ని చుక్కలు
తయారుచేసే విధానం
వనస్పతిని పంచదార పొడిని క్రీమింగ్‌ చేయాలి. గుడ్డును, వెనిల్లా ఎస్సెన్స్‌ను కలిపి బీట్‌ చేసుకుని క్రీమ్‌కు కొద్దికొద్దిగా కలపాలి. మైదాను కార్న్‌ఫ్లోర్‌ను, బేకింగ్‌ పౌడర్‌ను జల్లించి, క్రీమ్‌కు కలపాలి. పిండిని మృదువ్ఞగా చేసి, చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి. తర్వాత ఈ ఉండలు మీద మొదట నీటితో అద్ది, తర్వాత నువ్ఞ్వల మీద దొర్లించి, బేకింగ్‌ ట్రేలో ఒక్కో ఉండ అంగుళం దూరంలో ఉండేట్లు అమర్చి, ఓవెన్‌లో ఉంచి, 275డిగ్రీల ఫారెన్‌ హీట్‌లో 15నుండి 20నిముషాల వరకు బేకింగ్‌ చేస్తే నువ్ఞ్వల బిస్కెట్స్‌ రెడీ.