నీళ్లొచ్చాయి.. నిద్రలేవండి

Water projects
Water projects

నీళ్లొచ్చాయి.. నిద్రలేవండి

చాలా కాలం తర్వాత ఆలస్యంగానైనా ప్రకృతి కరుణించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇటీ వల కురిసినవర్షాలతో చిన్న నీటివనరులతో పాటు మధ్య, భారీ ప్రాజెక్టులలోకి నీరు వచ్చింది. ఒక్క నాగార్జున సాగర్‌ తప్ప మిగిలిన అన్నిప్రాజెక్టులు జలకళ తో ఉట్టిపడుతున్నాయి. మరో 70టిఎంసిల నీరు వస్తే నాగార్జున సాగర్‌ కూడా నిండుకుంటుంది. ఈ వర్షాలు ఖరీఫ్‌ పంటకు కొంత నష్టం కలిగించినా రబీ సాగుకు నీటి ఇబ్బంది ఉండకపోవచ్చునని రైతులు అభిప్రాయప డుతున్నారు.రబీపై రైతులుఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నిజానికి ఖరీఫ్‌ కంటే రబీలోనే సాగు రైతు చేతిలో ఉంటుంది. ఖరీఫ్‌లో ఎప్పుడు వర్షం వస్తుందో? నీరు సరిపోతుందో? లేదో?అంతా దైవాధీనం. దాదాపు ప్రకృ తిపైనే ఆధారపడి లక్షలాది ఎకరాల్లో పంటలు వేస్తారు. ప్రకృతిఏమాత్రం సహకరించకపోయినా పెట్టుబడితోసహా అంతా నష్టపోవాల్సిందే. రబీ అలా కాదు.

ఉన్న నీటిని అంచనా వేసుకొని సాగుకు సమాయత్తం అవ్ఞతారు. అందుకే ఖరీఫ్‌ కంటే రబీలో ఎకరాకు సగటు దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఖరీఫ్‌ కోతలు ఆరంభమయ్యాయి. మరో రెండుమూడువారాల్లో పూర్తి అవ్ఞతాయి. కానీ రైతాంగం ఇప్పటి నుంచే రబీకి సంబంధించిన సన్నాహాలు ప్రారం భించింది.చిన్ననీటివనరులతో సహా అన్ని చెరువ్ఞల్లోనూ, ప్రాజెక్టుల్లోనూ నీళ్లుకళ్లముందు కన్పడుతున్నాయి. ఇప్పు డు ముందుగా వారికి కావలసినది నాణ్యమైన విత్తనా లు.నకిలీ, నాసిరకంతో తమను ఈ రబీలోనైనా మోసం చేయకుండా చూడాలని రైతులు కోరుకుంటున్నారు. వ్యవసాయానికి మూలం విత్తనాలనేది అందరికీ తెలి సిందే.ఆ విత్తనాలే నకిలీవో,నాసిరకానివో అయితే పెట్టు బడి పెట్టిన తర్వాత చివరిలో ఆ విషయం తెలిసి రైతు కుప్ప కూలిపోతున్నాడు. గతఏడాది కూడా అటు ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం నకిలీ నాసిరకం విత్తనాలు అమ్మే కంపెనీలపై ఉక్కుపాదం మోపుతామని పదేపదే హెచ్చరించినా అవేమి ఆగలేదు. ఖరీఫ్‌లో ఎంతో మంది రైతులు ఈనకిలీ, నాసిరకం విత్తనాలతో మోసపోయారు.ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాలు, తెలంగాణాలో హైదరా బాద్‌, శంషాబాద్‌ నిజమాబాద్‌ వరంగల్‌ తదితర ఎన్నో ప్రాంతాల్లో ఈ నకిలీ విత్తనాల అమ్మకాలు జరిగాయి.

పోలీసులు ఆ వ్యాపారులను నకిలీ సరుకులతో సహా పట్టుకొని అరెస్టు చేశారు. జైళ్లకు పంపారు. ఖరీఫ్‌లో నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పిస్తామని పాలకులుచెప్పిన మాటలు అమలవ్ఞతాయో లేదో అనే సందేహాలు కూడా వ్యక్తమవ్ఞతున్నాయి. ఈ నకిలీ నాసిరకం విత్తనాలను తయారు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు నూతన విత్తన చట్టాన్ని తెస్తా మని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకూడా విత్తనచట్టం తెచ్చేందుకు ఒక ముసాయి దాను కూడా సిద్ధం చేసింది. వాస్తవంగా దశాబ్దాల క్రితం అప్పటి అవసరాలకు అనుగుణంగా రూపొందించిన జాతీయ విత్తన చట్టం, పదిహేనేళ్ల కిందట రూపొందిన జాతీయ విత్తనవిధానం రైతులను రక్షించలేకపోతున్నా యి. ఆ చట్టాలు కానీ,విధానాలు కానీ రైతుల కంటే దళారులకు ఉపయోగపడేలా ఉన్నాయి.

అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో పేరు న్న కొన్ని కంపెనీలు విక్రయించే విత్తనాల్లోనూ కల్తీలు ఉండటం ఆందోళన కలిగించే అంశం.మార్కెట్‌లో మా మూలు ధరకుకొన్న సరుకులనే విత్తనాలుగా మార్చిపది, పన్నెండు రెట్లు ధరలు అధికం చేసి అమ్ముకుంటున్నారు.ఇదంతా ఇప్పటికప్పుడు పుట్టు కొచ్చింది కాదు. ఏనాటి నుంచో జరుగుతున్నది. ఎప్పటి కప్పుడు పాలకులు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు.అయి నా అవేమీ ఆగడంలేదు. అంకంతకు పెరిగిపోతున్నాయి. ఇందుకు ప్రధానకారణం విత్తనాల వ్యాపారాల్లో కొందరు రాజకీయ నాయకులు ఉండటమో,లేక ఆవ్యాపారులతో మమేకం కావడమో జరుగుతుంది. అందుకే అధికార వర్గాలు కూడా అటువైపు కన్నెత్తి చూడలేకపోతున్నాయి. అసలు వాస్తవంగా తెలుగురాష్ట్రాల్లోనే కాదుదేశవ్యాప్తంగా కూడా ఈనకిలీ నాసిరకం విత్తనాలురైతుల ఉసురు తీసు కుంటున్నాయి. ఇందుకునిర్దిష్ట నియంత్రణ వ్యవస్థలేదు. విత్తనాల ఉత్పత్తి దశలోనే కంపెనీల తీరుతెన్నులు, మౌలిక సదుపాయాలు వనరులు తదితర అంశాలను పరిశీలించడం లేదు. రైతుల వద్ద కొని నేరుగా సంచుల్లో నింపిఏదో లేబుల్‌ పెట్టి విక్రయిస్తే తనిఖీ చేసి పట్టుకునే వారే లేరు. ప్రస్తుతం ఉన్న చట్టంలోని నిబంధనలను కూడా గాలికి వదిలేస్తున్నారు.గడువ్ఞ దాటిన విత్తనాలను మళ్లీ ప్రయోగశాలలో పరీక్షించి వాటిలో మొలకెత్తే శాతం ఎంత అనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తిరిగి విక్ర యించడానికి అనుమతి పొందాలి. కానీ ఇలాంటివి ఏవీ పాటించడం లేదు. కొన్ని విత్తన కంపెనీలు ఇష్టాను సారంగా వ్యవహరిస్తున్నాయి.

మరింత పకడ్బందీగా చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది. కానీ అవి రైతు లను రక్షించేవిగా ఉండాలి. రైతులను మోసం చేసేం దుకు ఏ పరిస్థితుల్లోనూ అవకాశం ఉండకూడదు. అంతేకాదు ముందుగా సంబంధిత అధికారులను విత్తన కంపెనీలకు పంపి అక్కడున్న వసతులు ఏమిటి? వన రులు ఏమిటి? నాణ్యమైన విత్తనాలు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందా? ఆ కంపెనీ చెప్పినట్టుగా అధిక దిగు బడి ఇచ్చే అవకాశాల గూర్చి క్షుణ్ణంగా పరిశీలిం చాలి. రబీ ముంచుకొచ్చిన ఈ తరుణంలో నాణ్యమైన విత్తనాల సరఫరాకు పాలకులు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.వీటితో పాటురుణ సహా యం, తదితర అంశాలపై పాలకులు దృష్టి పెట్టాలి. వ్యవసాయశాఖ అధికారులను కూడా అప్రమత్తం చేసి కార్యోన్ముఖుల్ని చేయాల్సిన తరుణమిది.

– దామెర్ల సాయిబాబ,

ఎడిటర్‌, హైదరాబాద్‌