నీలోఫర్‌లో శిశువు కిడ్నాప్‌ కలకలం

Niloufer Hospital
Niloufer Hospital

హైదరాబాద్‌: నగరంలోని ప్రముఖ పిల్లల నీలోఫర్‌ హాస్పిటల్‌లో శిశువు అపహరణ కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన
వివరాల ప్రకారం గత శుక్రవారం ఆస్పత్రిలో నిర్మల పేట్ల బురుజు హాస్పిటల్‌లో మగబిడ్డకు జన్మనిచ్చింది. కాగా,
పేట్లబురుజు హాస్పిటల్‌లో ఓ మహిళ ఆయాగా పరిచయం పెంచుకొంది. శిశువు అస్వస్థతకు గురికావడంతో శిశువు
అమ్మమ్మ, ఆయాగా పరిచయమైన మహిళతో 108 వాహనంలో నీలోఫర్‌ ఆస్పత్రికి చేరుకొంది. శిశువుకు వైద్యులు ఎక్స్‌రే కొరకు
రాయగా వాటి నిమిత్తం పరీక్షల నిర్ధారణ కోసం కొంత సమయం వేచి చూసి, పరీక్షలు పూర్తి అయిన తర్వాత ఆమెతో
పాటు వచ్చిన మహిళ తనకు ఆకలిగా ఉందని తినడానికి ఏమైనా తీసుకురమ్మని చెప్పగా, శిశువు అమ్మమ్మ ఆహారపదార్ధాలు
తీసుకురావడానికి వెళ్లగానే సదరు మహిళ శిశువును కిడ్నాప్‌ చేసింది. బాధిత మహిళ అక్కడే చేరుకోగానే శిశువుతో సహా
సదరు మహిళ కనిపించకపోవడంతో ఆమె నిర్ఘాంతపోయింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు
చేసి, సిసి కెమెరాల ఫుటేజి ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు. కాగా వార్త ప్రతినిధి హస్పిటల్‌ సూపరింటెండెంట్‌ను
సంప్రదించగా శిశువు అమ్మమ్మ తనతో వచ్చిన మహిళను చిన్నకూతురని చెప్పడంతో హాస్పిటల్‌లోకి అనుమతించామని
చెప్పారు. శిశువు వైద్య పరీక్షలు పూర్తయిన వెంటనే సదరు మహిళ శిశువును అపహరించుకొని పోయిందని వారు
తెలిపారు.