నీరవ్‌ విల్లా కూల్చివేత తాత్కాలిక నిలిపివేత

Nirav Modi,maharashtra,raigad district
Nirav Modi,maharashtra,raigad district

ముంబయి: వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోడి విల్లా కూల్చివేత పనులను జనవరి 27 నుండి మహారాష్ట్ర అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. అధికారులు విల్లా నిర్మాణంలో ఉపయోగించిన కొన్ని విలువైన సామాగ్రిని దెబ్బతినకుండా సేకరిస్తున్నారు. నిర్మాణంలో వాడిన సామాగ్రి విలువ భారీ మొత్తంలో ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. బంగ్లాకు సంబందించిన పనులపై సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగం ఇంజినీర్ల నుంచి నివేదిక కోరామని, కూల్చివేత పనులకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై వారిని వివరాలు తెలుసుకున్నామని రాయ్ గడ్ జిల్లా యంత్రాంగం తెలిపింది.