నీట్ ద‌ర‌ఖాస్తు గ‌డువు పెంపు

NEET
NEET

న్యూఢిల్లీః నీట్ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు గడువును ఈనెల 12వతేదీ వరకు పెరిగింది. నేషనల్ ఎలిజిబిలిటి ఎంట్రన్స్ క‌మ్ టెస్ట్‌ (నీట్) రాయాలనుకునేవారు ఈనెల 12వతేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తెలిపింది. నీట్ దరఖాస్తుతోపాటు విద్యార్థులు తమ ఆధార్ సంఖ్యను పేర్కొనాలని గతంలో సీబీఎస్ఈ ప్రకటించింది. అయితే నీట్ తదితర ఆలిండియా స్థాయి పరీక్షలకు ఆధార్ సంఖ్యను పేర్కొనవలసిన అవసరం లేదని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలను సమర్పించేందుకు సీబీఎస్ఈ అనుమతించింది.