‘నీట్‌’లో తెలుగు విద్యార్థుల హవా

NEET RESULTS

‘నీట్‌’లో తెలుగు విద్యార్థుల హవా

హైదరాబాద్‌కు చెందిన రోహన్‌కు రెండో ర్యాంకు

హైదరాబాద్‌,: వైద్యవిద్యలో ప్రవేశానికి గాను నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌)లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యా ర్థులు సత్తాచాటారు. 2018 విద్యా సంవత్సరానికి గాను వైద్య కళాశాలల్లో ప్రవేశానికి గాను ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ఫలితాలను సీబీఎస్‌ఈ సోమవారం ప్రక టించింది. ఇందులో హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి రోహన్‌ పురోహిత్‌ 690 మార్కులతో జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు సాధించాడు. 690 మా ర్కులు సాధించి ఢిల్లీకి చెందిన హిమాన్షు శర్మతో కలసి ఇతను రెండో ర్యాం కును పంచుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన మరో విద్యార్థి వరుణ్‌ ముప్పిడికి ఆరో ర్యాంకు దక్కింది. అలాగే, విజయవాడకు చెందిన విద్యార్థి ఏ.అనిరుధ్‌ బాబు 8వ ర్యాంకుతో సత్తా చాటాడు. కాగా, నీట్‌లో జాతీయ స్థాయిలో బీహార్‌ బాలిక కల్పనా కుమారి ప్రథమ ర్యాంకు సాధించింది. మొత్తంగా 691 మార్కులు సాధించిన ఆమె దేశంలోనే టాప్‌ ర్యాంకర్‌గా నిలచింది. 686 మార్కులతో రాజస్థాన్‌కు చెందిన ప్రిన్స్‌ చైదరితో కలసి సంయుక్తంగా ఢిల్లీకి చెందిన అరోష్‌ ధమిజాకు మూడో ర్యాంకు సాధించాడు. నీట్‌ పరీక్షకు దేశవ్యాప్తంగా సుమారు 13 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో నీట్‌ ద్వారా సుమారు 60 వేల మెడికల్‌, డెంటల్‌ సీట్లను భర్తీ చేస్తారు. సీబీఎస్‌ఈ ప్రకటించిన నీట్‌ ఫలితాలలో టాప్‌ టెన్‌ ర్యాంకులలో ఇద్దరు అమ్మాయిలు ఉండటం విశేషం.