నీటి విలువ తెలిసిన వ్యక్తి కెసిఆర్‌

HARISH RAO
HARISH RAO

హైదరాబాద్‌: నదులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. సిఎం కెసిఆర్‌కు నీటి విలువ తెలుసు కాబట్టే పెద్ద ఎత్తున ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. దేశంలోనే నీటిపారుదల ప్రాజెక్టులకు అత్యదిక నిధులు విడుదల చేసిన ఏకైక సిఎం కెసిఆర్‌ అని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు చెప్పారు. ఖైరతాబాద్‌లోని ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌లో తెలంగాణ వాటర్‌ రిసోర్సెస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, ఇండియా వాటర్‌ కౌన్సిల్‌ అధ్వర్యంలో కృష్ణానదీ పునర్జీవనం అనే అంశంపై మంగళవారంనాడు జాతీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లా డుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో 37లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం, కాళేశ్వరం ప్రాజెక్టులో 365 రోజుల పాటు నీళ్లు ఉంటాయిఅని చెప్పారు.’కృష్ణా నది పునర్జీవనం చేయడం శుభ పరిణామం, మహారాష్ట్రలో విద్యుత్‌ ఉత్పత్తి చేసిన నీటిని అరేబియా సముద్రంలోకి వదులుతున్నది, ఆ నీటిని కృష్ణా నీటిలోకి వదిలితే మన రాష్ట్రంలో ఐదు చోట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయవచ్చు. వృధాగా సముద్రంలోకి వెళ్లే నీటిని ఉపయోగిం చుకునేలా కార్యక్ర మాలు రూపొందించాలని హరీష్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన సమయంలో చెరువులు పూర్తిగా ధ్వంసమయ్యా యి.మిషన్‌ కాకతీయ పేరుతో చెరువులను పునరుద్దరణ చేస్తున్నం, దీంతో గ్రౌండ్‌ వాటర్‌ పెరిగింది. హరితహారంతో చెట్లను పెంచే కార్యక్రమాన్ని చేపట్టినం.మానేరు, మూసీనదుల పునర్జీవనం కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది. కృష్ణా బేసిన్‌లో వర్షపా తం తక్కువగా ఉండటం,కృష్ణా నీటిని వాడుకోలేకపోవడంతో అక్కడి ప్రజలు గతంలో వలస వెళ్లారు. కృష్ణా నది నుంచి 6లక్షల 50వేల ఎకరాలకు సాగునీటిని అందించాం. వలస వెళ్లిన వారు తిరిగి వచ్చి వ్యవసాయం చేసుకుంటు న్నారు. కృషా నదిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. నీటి విలువ తెలిసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అని పేర్కొన్నారు..
నదుల పునరుజ్జీవానికి తెలంగాణ ప్రభుత్వం మిషన్‌ కాకతీయను చేపట్టింది. కృష్ణా బేసిన్‌లో ఆరువేల చెరువులను పునరుద్ద రించాం. మిషన్‌ కాకతీయ వల్ల తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తి పెరిగింది. చేపల ఉత్పత్తి 62శాతం పెరిగింది. కృష్ణా నీటి వినియోగంలో భాగంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో పలు ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించాం.వందేళ్లుగా నిరీక్షిస్తోన్న కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పూర్తి చేశాం. అరున్నర లక్షల ఎకరాలకు నీరు అందిస్తు న్నాం. ఒకప్పుడు వలసల బాట పట్టిన పాలమూరు ప్రజలు ఇప్పుడు గ్రామాల్లోనే సంతోషంగా జీవిస్తున్నారు. కోయిన డ్యామ్‌ నుంచి ప్రతీ ఏటా కర్ణాటక 100 టిఎంసీల నీటిని విద్యుత్‌ ఉత్పత్తి కోసం వినియోగిస్తోంది. అనంతరం ఆ నీరు పూర్తిగా అరేబియా సముద్రంలో వృధాగా కలుస్తోంది. అది వృధా కానివ్వకుండా చూస్తే అంతకంటే ఎక్కువ విద్యుత్‌ని ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. వ్యవసాయ అవసరాలకు కూడా ఉపయోగించుకోవచ్చు. తాగునీటి అవసరాల కోసమైనా నదులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. నదులను కాపాడుకోకపోతే భవిష్యత్‌ తరాలకు తీరని నష్టం జరుగుతుందిఅని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లక్ష్మారెడ్డి, మాట్లాడుతూ కృష్ణా నది తెలంగాణకు ఓ జీవనది, మహబూబ్‌నగర్‌ జిల్లాకు వర ప్రదాయిని, ఇన్నాళ్లూ కృష్ణా నది తలాపునే ఉన్నప్పటికీ తాగడానికి నీరు లేక పాలమూరు వలస జిల్లాగా మారింది.గత పాలకుల నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో నదుల నీరు ఇక్కడి ప్రాంత ప్రజలకు ఉపయోగపడకుండానే సముద్రం పాలైంది, తెలంగాణ ఆవిర్భావం తర్వాత నీటి విలువ తెలిసిన సిఎం కెసిఆర్‌ చొరవతో రాష్ట్రం సస్యశామలం అవుతున్నది. చాలాకాలం పెండింగ్‌లో ఉన్న కల్వకుర్తి పూర్తయింది,. నెట్టంపాడు,కోయిల్‌సాగర్‌,భీమా ప్రాజెక్టులు కూడా పూర్తయితే పాలమూరు జిల్లా పసిడి జిల్లాగా మారుతుంది. సిఎం కెసిఆర్‌ ఔదార్యంతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును చేపట్టారు. నదులే ప్రజల జీవనాధారం వాటిని కాపాడుకోవడం తప్పనసరి అని పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా రాజేందర్‌సింగ్‌, జలవనరుల అభివృద్ది సంస్థ చైర్మన్‌ వి.ప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.