నీటి పారుదల శాఖపై సిఎం కెసిఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ తెలంగాణ నీటి పారుద‌ల శాఖ‌పై స‌మీక్ష నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రుగుతున్న ఈ స‌మీక్షా స‌మావేశానికి నీటి పారుద‌ల శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి ర‌జ‌త్ కుమార్‌, ఈఎన్‌సీ ముర‌ళీధ‌ర్‌తో పాటు ప‌లువురు అధికారులు హాజ‌ర‌య్యారు. ఈ స‌మావేశంలో నీటి పారుద‌ల శాఖ బ‌డ్జెట్‌పై సిఎం చ‌ర్చిస్తున్నారు.

15వ ఆర్థిక సంఘం సిఫార‌సులు, కేంద్ర బ‌డ్జెట్ ద్వారా రాష్ర్టానికి అందే నిధుల‌పై సిఎం గురువారం ఉన్న‌త‌స్థాయి స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్షుడు వినోద్ కుమార్‌, సీఎస్ సోమేశ్ కుమార్‌, ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి కే రామ‌కృష్ణారావు పాల్గొన్నారు. రాష్ర్ట బ‌డ్జెట్ రూప‌క‌ల్ప‌న‌పై సిఎం ప్రాథ‌మికంగా చ‌ర్చించారు.