నీటివాటాపై సూటిపోరు

TS MINISTER HARISH, TUMMALA
TS MINISTERS HARISH, TUMMALA

నీటివాటాపై సూటిపోరు

కృష్ణా, గోదావరిలో న్యాయంగా దక్కాల్సిన నీటికోసం
కదులుతున్న ప్రభుత్వం

కృష్ణాలో 575 టిఎంసిలకు డిమాండ్‌
ఎపిలోని ‘పట్టిసీమపై కేంద్రానికి ఫిర్యాదు
నేడు ఢిల్లీలో కృష్ణా బోర్డు ముందుకు 2 రాష్ట్రాలు

హైదరాబాద్‌ కృష్ణా, గోదావరిలో తెలంగాణకు న్యాయంగా దక్కవలసినవాటాపై గట్టిగా పోరాడా లని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీలో గురువారం జరగనున్న కృష్ణాబోర్డు సమావ ేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై బుధవారం ఇక్కడ జలసౌధలో ఇరిగేషన్‌ అధికారులతో మంత్రి హరీష్‌రావు సుదీర్ఘంగా చర్చించారు. ఏపి నుంచి కూడా అధికారులు హాజరై తమ వాటాపై, హక్కులపై మాట్లాడుతారు. కాగా, బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ ద్వారా ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపుల ప్రకియ అనంతరమే కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేయాలని కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్రం కోరనుంది.

గతం లోనూ ఇదే వైఖరిని తెలంగాణ స్పష్టం చేసినట్లు హరీష్‌రావు గుర్తు చేశారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలకు నష్టం కలిగించే విధంగా ఆంధ్రప్రదేశ్‌ చేసే ప్రతిపాద నలను ఎలా తిప్పికొట్టాలన్న ఆంశంపై కూడా చర్చించారు. పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ వల్ల జరిగే ముంపు సమస్యలపై మంత్రి హరీష్‌ రావు సమీక్షించారు. తెలంగాణలోని చారిత్రక భద్రాచలం శ్రీసీతారామస్వామి దేవాలయం సహా పలుగ్రామాలు, బొగ్గు గనులు,మణుగూరు హేవీ వాటర్‌ ప్లాంట్‌ తదితర ముఖ్యమైన ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. భద్రాచలం పట్టణం దాని చుట్టుపక్కల గోదావరి పరీవా హక ప్రాంతంలో 124 కిలోమీటర్ల మేరకు పోలవరం ప్రభావంఉంటుందని అన్నారు,

పోల వరం బ్యాక్‌ వాటర్‌ వల్ల ప్రబావిత ప్రాంతాలు, తలెత్తే సమస్యలపై అధ్యయనం చేయాలంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఆదేశించా ల్సిందిగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురా వాలని ఉన్నతాధికారులను మంత్రి హరీష్‌రావు కోరారు. బచావత్‌ ట్రిబ్యూనల్‌ అవార్డు ప్రకారం పోలవరంకు కేంద్ర జల సంఘం అనుమతులు ఇచ్చిన తర్వాత నాగార్జునసాగర్‌ ఎగువన ఉన్న రాష్ట్రాలకు 45 టిఎంసీల నీటిని వినియోగించు కునే హక్కు దక్కుతుందని మంత్రి అన్నారు. ప్రస్తుతం కేంద్రమే జాతీయ ప్రాజెక్టుగా పోల వరం చేపట్టినందున ఆ 45 టిఎంసీల నీటిని తెలంగాణకుకేటయించాలని హరీశ్‌రావు కోరారు.