నీటిపారుదలశాఖలో ఎమర్జెన్సీ

అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదు : మంత్రి హరీష్‌రావు
ఢిల్లీ నుంచే సమీక్ష
ఇంజినీర్లకు సెలవులు రద్దు
హైదరాబాద్‌ : రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నీటిపారుదల శాఖ అప్రమత్తమైంది. ఢిల్లీ వెల్లిన మంత్రి హరీష్‌రావు అక్కడి నుంచే పరిస్థితులను సమీక్షిస్తున్నారు. పరిస్థితిని పరిశీలించి ఇరిగేషన్‌ శాఖలో ఎమర్జెన్సీ విధిస్తూ ఆయన ఆదేశాలు జారీచేశారు. శ్రీరాంసాగర్‌ ప్రధాన కాలువకు గండిపడి అపారనష్టం వాటిల్లడం, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో నీటిపారుదలశాఖను అలర్ట్‌ చేశారు. మేజర్‌, మీడియం, మైనర్‌ ఇరిగేషన్‌ శాఖలో అధికా రులు, ఇంజినీర్లు, సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. సిఇల నుంచి ఏఇల వరకు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రధాన ప్రాజెక్టుల కాలువలు, అవి బలహీనంగా ఉన్న చోట్ల వెంటనే దృష్టి సారించి ముందస్థు చర్యలు తీసుకోవాలని  సూచించారు. సిమెంట్‌, ఇసుక బస్తాలను సిద్దం చేసుకోవాలని చెప్పారు. ప్రతి గంటకు వర్షపాతం నమోదు చేయాలన్నారు. చెరువ్ఞల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండా లని ఆదేశించారు. గండ్లు పడకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎక్కడి నుంచైనా ఎవరి వద్ద నుంచైనా ఫలానా చెరువుకు, కాలువకు, కట్టకు గండిపడే అవకాశాలున్నాయని సమా చారం వస్తే అలసత్వం చేయకుండా వెంటనే అక్కడికి సంబందిత ఇంజనీర్లు, సిబ్బంది చేరు కుని తగుచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఢిల్లీ నుండి ఆన్‌ లైన్‌లో మంత్రి హరీష్‌ రావు    పరిస్థితిని    ఎప్పటికప్పుడు వాట్సాప్‌ ద్వారా అక్కడి నుంచే ఇక్కడి అధికారులకు తగు సూచనలు, ఆదేశాలు జారీచేస్తున్నారు. నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినందున అక్కడ చెరువులకు గండిపడే అవకాశాలున్నాయని అక్కడి సిఇ, ఇంజనీర్లను అప్రమత్తం చేశారు. వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భారీ వర దల వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించాలన్నారు. ఆ ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశిం చారు. చెరువులు, ప్రాజెక్టుల్లో ఏమేరకు నీళ్లు చేరాయో సమాచారాన్ని వెంటనే అధికారులకు సమాచారమందించాలని తెలిపారు.