నివేదిక వచ్చాకే.. సమాధానం: స్మృతి ఇరానీ

 

SRUMTI IRANI
న్యూఢిల్లీ: హెచ్‌సియులో జరిగిన దుర్ఘటనపై విచారణ జరుపుతున్న ద్విసభ్య కమిటీ నివేదిక వచ్చాకే మాట్లాడతానని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. ఢిల్లీలో మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. రోహిత్‌ ఆత్మహత్య దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ అంశంపై ఆ రాష్ట్ర పరిధిలోనిదని కూడ తెలిపారు. ఇటువంటి సంఘటనలను రాజకీయం చేయటం తగదన్నారు. విపక్షాలు చేస్తున్న విమర్శలపై తానేమీ మాట్లాడనని తెలిపారు.