నివాసగృహ విక్రయాల్లో హైదరాబాద్‌ 67% వృద్ధి

HYDERABAD
మెట్రోరైల్‌ పూర్తయితే మరింత ప్రగతి
హైదరాబాద్‌ : నివాసగృహాల అమ్మకాల్లో హైద రాబాద్‌ 67శాతం వృద్ధిని సాధించినట్లు జోన్స్‌లాంగ్‌ లాసెల్లీ సంస్థ అధ్యయనంలో తేలింది. గత ఏడాది నాలుగోత్రైమాసికం నుంచి ఈ ఏడాది మూడోత్రైమాసికం చివరివరకూ ఉన్న విక్ర యాలను పరిశీలిస్తే మంచి వృది ధున్నట్లు విశ్లేషించింది. ఈ కాలంలోనే అంతకుముందు సంవత్సరం 4200 గృహాలను విక్రయిస్తే ఈఏడాది ఏడువేల యూనిట్లు విక్రయాలు జరిగాయి. గడచిన ఆరునెలల్లో ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడ్డా యి. మంచి మార్కెట్‌ సెంటిమెంట్‌ కలిసిరావడంతో కార్పొరేట్‌ సంస్థలు కూడా ఎక్కువ ఏర్పాటుచేసుకునేందుకు ఈప్రాంతం లో ముందుకువస్తున్నాయి. రాజకీయ వాతావరణం కూడా మెరుగుపడింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత అనిశ్చితి తొల గిపోవడంతో ఆర్థిక కార్యకలాపాలు, బిజినెస్‌ వాతావరణం మెరుగుపడుతున్నట్లు రియాల్టీ సర్వేసంస్థ జెఎల్‌ఎల్‌ అంచనా వేసింది. ప్రభుత్వం కూడా ఎక్కువ పెట్టుబడులు రాబట్టేకృషిలో ఉంది. ఆర్థిక కార్యకలాపాలు ఊలపందుకున్నాయి. అందు వల్లన రెసిడెన్షియల్‌ రియాల్టీ మార్కెట్‌ మరింత ప్రకాశిస్తుందని జె ఎల్‌ఎల్‌ వెల్లడించింది. గడచిన మూడు త్రైమాసికాల్లో చూస్తే ఎక్కువ ప్రాజెక్టులు విడుదలయ్యాయి. అంతకుముందు సంవత్సరం కంటే 1.5రెట్లు పెరిగాయి. వాటి విలువలు కూడా 5-10 శాతం పెరిగినట్లు జెఎల్‌ఎల్‌ ప్రకటించింది. ఏటికేడాది వృద్ధి ఉన్నం దున నగరం ధరలపరంగా కూడా ముందుకు పోతుందని అంచనా. ఇక పశ్చిమప్రాంతంలోని మార్కెట్‌ 2008నాటి గరిష్టస్థాయిని దాటు తుందని అంచనా. ఐటిహబ్‌, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి వంటివి కీలక ప్రాంతాలుగా మారాయి. 85శాతం కొత్త ప్రాజెక్టుల ఈ మూడేళ్ల లోనే ప్రారంభించారు. ఇక రానున్న మెట్రోరైల్‌ తూర్పుపశ్చిమ కారి డార్‌ను కలుపుతున్నది. ప్రస్తుతం ఉన్న వాణిజ్యహబ్‌లు హైటెక్‌సిటీ, గచ్చిబౌలి ఇకపై పతాకస్థాయికి చేరుకుంటాయి. తూర్పువేపు కొంత మార్కెట్‌లో తక్కువ ధరలు పలుకుతున్నాయి. రానురాను ఈ ప్రాంతంలో కూడా రియాలీ టధరలు పెరుగుతాయని జెఎల్‌ఎల్‌ అంచనా. ఔటర్‌రింగ్‌రోడ్డు వెంబడి ప్రతిపాదించిన శాటిలైట్‌ టౌన్‌షిప్‌ప్రాజెక్టులు, తెల్లాపూర్‌ సమీకృత టౌన్‌షిప్‌ప్రాజెక్టులు వంటివి దీర్ఘకాలంలో మంచి ప్రభావం చూపిస్తాయని అంచనా.