నిల‌దీసినందుకు ఠాణాలో నిర్బంధం… పోలీసుల ఆరాచ‌కం

Police
Police

గుంటూరు: ఫిరంగిపురం పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. సమస్యలపై నిలదీసిన దంపతులను మంగళవారం రాత్రి నుంచి పోలీ‌స్టేషన్‌లో ఉంచారు. ఇప్పటికీ బయటకు విడిచిపెట్టకపోవడంతో వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్నారు. కాగా ఎమ్మెల్యే శ్రావణ్ మంగళవారం మునగపాడులో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. అయితే కొంతమంది స్థానిక మహిళలు సమస్యలపై ఎమ్మెల్యే శ్రావణ్‌ను నిలదీశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే శ్రావణ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మహిళతో పాటు ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటికీ వాళ్లని బయటకు విడిచి పెట్టలేదు. వారి వివరాలు కూడా బయటకు ఇవ్వలేదు. దీంతో పోలీసుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నించిన వారి గొంతుని పోలీసులే నొక్కేస్తే ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన చెందుతున్నారు.