నిర‌హార దీక్ష విర‌మించిన స్వాతి

Swathi Malival
Swathi Malival

న్యూఢిల్లీ: రేపిస్టులకు ఉరిశిక్ష పడేలా చట్టాలను కఠినతరం చేయాలంటూ గత పది రోజులుగా రాజ్‌ఘాట్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో దీక్ష విరమించారు. ‘నేను ఒంటరిగానే పోరు చేసినా దేశవ్యాప్తంగా ప్రజలు మద్దతిచ్చారు. ఇదో చారిత్రక విజయంగా నేను భావిస్తున్నా. ఈ విజయానికి దోహదపడిన అందరినీ అభినందిస్తున్నాను’ అని దీక్ష విరమణ అనంతరం స్వాతి మలివాల్ అన్నారు. పన్నెండేళ్ల లోపు మైన‌ర్ల‌పై అత్యాచారానికి పాల్పడిన వారికి ఉరిశిక్ష విధించేందుకు వీలుగా కేంద్ర కేబినెట్ శనివారం ఆర్డినెన్స్ తీసుకురావడంతో దీక్ష విరమించాలని స్వాతి మలివాల్ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదముద్ర కూడా వేయడంతో ఆదివారం చిన్నారులు ఇచ్చిన నిమ్మరసం తీసుకుని ఆమె దీక్ష విరమించారు.