నిర్వాసితుల‌కు పున‌రావాసంః సీఎం

N. Chandrababu
N. Chandrababu

అమరావతి: పోలవరం నిర్వాసిత కాలనీలను మోడల్ కాలనీలుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. మొత్తం 74 కాలనీలకు అవసరమైతే ప్రత్యేకంగా ఐటీడీఏ ఏర్పాటు చేయాలన్నారు. లక్ష కుటుంబాలకు ప్యాకేజీ, మౌలిక వసతుల కల్పన ప్రభుత్వ కర్తవ్యం అని సీఎం పేర్కొన్నారు. పునరావాసం, పరిహారం కింద మరింత సాయానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సోమవారం పోలవరం పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 68వ సారి వర్చువల్ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరం పనులను పరిశీలించిన ఆయనకు.. పోలవరం ప్రాజెక్టు పనులు మొత్తం 56.69 శాతం పూర్తయ్యాయిని అధికారులు వివరించారు. దాంతోపాటు తవ్వకం పనులు 76.30 శాతం పూర్తయ్యాయని, కాంక్రీట్ పనులు 30.70%, పొలవరం కుడి ప్రధాన కాలువ 90%, ఎడమ ప్రధాన కాలువ పనులు 62.27%, రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ పనులు 61.55%, కాఫర్ డ్యాం జెట్ గ్రౌంటింగ్ పనులు 93% పూర్తయ్యాయని తెలిపారు.