నిర్భయ దోషులకు ఉరే సరి: సుప్రీం

SUPREME COURT
SUPREME COURT

ఢిల్లీ: నిర్భయ కేసులో సుప్రీం ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. దోషులకు ఉరిశిక్ష విధించడాన్ని సుప్రీం సమర్థించింది. ఢిల్లీ హైకోర్టుతో పాటు దిగువ కోర్టులు ఇచ్చిన తీర్పు సరైనదేనని తేల్చి చెప్పింది. ముగ్గురు దోషులు వేసిన రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించింది. ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలంటూ దోషులు రివ్యూ పిటిషన్‌పై త్రిసభ్య బెంచ్‌ తీర్పు వెలువరించింది. నలుగురు దోషులకు ఢిల్లీ హైకోర్టుతో పాటు దిగువ కోర్టులు ఉరిశిక్ష విధించాయి. ఉరిశిక్ష విధించడంపై దోషులు సుప్రీంను ఆశ్రయించారు. కింది కోర్టు తీర్పును సమర్థిస్తూ 2017 మే 5న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. తీర్పును సవాల్‌ చేస్తూ రివ్యూ పిటిషన్‌ను ముగ్గురు దోషులు ముఖేష్‌,పవన్‌,విన§్‌ుశర్మలు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై నేడు తీర్పు వెలువరించిన సుప్రీం దోషులకు ఉరిశిక్ష సమ్మతమే తేల్చి చెప్పింది. దోషులు మరోమారు పిటిషన్‌ వేసుకోవచ్చని కోర్టు సూచించింది.