నిరుపేద గ్రామీణ భారతంలో అన్నిటికీ కరవే

                      నిరుపేద గ్రామీణ భారతంలో అన్నిటికీ కరవే

water drought in INDIA
water drought in INDIA

మంచినీళ్లు తెచ్చుకోవడానికి మైళ్లు దూరం నడవటం భారతీయ మహిళాలోకంలో గ్రామీణ నిరుపేదల స్త్రీలకు దేశమంతటా ప్రస్తుతం అనుభవంలోకి వస్తున్న వార్తాంశం. స్వచ్ఛతపదం నాగరికులకే. ప్రాణాధారమైన తాగునీటి కోసం నిరంతరం తపించే అసంఖ్యాక కుటుంబాలు కోకొల్లలు. మరాట్వాడా లాతూర్‌, బుందేల్‌ఖండ్‌ మహోబా, రాజస్థాన్‌, తెలంగాణ ఇలా ఎన్నో రాష్ట్రాలలో అనావృష్టి, తీరని వ్యధ కలిగి స్తోంది. ఇక తెలుగు రా ష్ట్రాల్లో ఏజెన్సీ ప్రాంతాల సంగతి చెప్పనవ సరం లేదు. ఉదాహరణకు ఆంధ్ర, తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన మహిళలు దాదాపు నాలుగుకిలో మీటర్ల దూరం వెళ్లి గెడ్డలు, చెలమల్లో ఊరే నీటిని తెచ్చుకోవలసి వస్తోంది. గెడ్డల్లో నీరు ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూస్తేనే తెలుస్తుంది. నాచు పట్టిన గుంతల్లోంచి నీటిని తోడుకోవలసి వస్తోంది. గెడ్డల్లో ఒకపక్క పశువ్ఞలను కడగడం, బట్టలు ఉతకడం చేస్తుంటారు. మరోపక్క తాగునీటి కోసం బిందెలతో నీళ్లు పట్టుకొంటుంటారు. గోదావరి జిల్లాల్లోనూ తాగునీటికి ఇక్కట్లు పడుతుంటే అంతకన్నా దీనస్థితి ఇంకొకటి ఉండదు.

రాజ మండ్రి శివారు ప్రాంతాలే కాదు రాజా నగరం వంటి ప్రాంతాల్లోనూ మంచినీటికి కరవ్ఞఏర్పడింది. రాజా నగరం పంచాయితీశివారు సూర్యా పేటలో కొన్నాళ్ల క్రితం ఖాళీ బిందెలతో మహిళలు నిరసన వ్యక్తం చేస్తూ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. పల్లెలలో పట్టణాలలో,నగరాలలో అభివృద్ధి పేరిట మితిమీరిన జలకాలుష్యం ప్రాణాలను హరిస్తోంది. గంగ, యమున వంటి జీవనదులు నగర పారిశ్రామిక జలకాలుష్యంతో ఉక్కిరిబిక్కిరై మృతనదీ ప్రవాహాలుగా ప్రవహిస్తున్నాయి. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎగుమతి, దిగు మతుల సంపన్నత కీలకంగా నడుస్తోంది. కరవ్ఞ కాటకాల కోరలలో చిక్కుకొంటున్న విషాదభారతావనిలో శృతిమించిన టెక్నాలజీ వ్యామోహంతో తిండి గింజలకు భిక్షాపాత్ర చేపట్టవలసిన అగత్యం ప్రభుత్వాధినేతలకు తప్పేటట్టులేదు. వర్షాలుసకాలంలో,దుర్భిక్ష ప్రాంతాలలో కరుణిస్తే, భూగర్భజలాల నీటిమట్టం పెరిగి తాగునీటి సమస్య పరిష్కారానికి ఉపశమనం కొంత లభించవచ్చు. కాని తిండిగింజలు అందుబాటు ధరలకు లభ్యత ఒక్కసీజన్‌లో తీరేది కాదు. ఇప్పటికే రుణభారంతో కనీసం పెట్టుబడి ఖర్చు లభించక అత్యంత దయనీయంగా అసంఖ్యాక రైతాంగం ఆత్మహత్యలతో తనువ్ఞలు చాలిస్తున్నారు.

భూమిపై ఆధారపడి జీవించే వ్యవసాయ కార్మికులు, సన్నచిన్న కౌలు రైతులు, ముఖ్యంగా నిరక్షరాస్యులైన కుటుంబాలు శారీరక శ్రమతో బతకటానికి నగరాలకు తరలిపోతున్నారు. పొట్ట నిండే మార్గం లేక వలసబాట పట్టిన పేదలు, ఇతర రైతాంగం పాడి పశు వ్ఞలకు మేత పెట్టలేక కబేలాలకు అమ్ముకొంటున్నారు. పప్పు ధాన్యాలు నిరుపేదలకు ఖరీదైన విలాసవినియోగం అవ్ఞతున్నాయి. నిత్యావసర వస్తువ్ఞల ధరలు ఆకాశాన్ని అంటడంతో జన సామాన్యానికి పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి.విత్తు నుంచి పంట వరకు రైతుకు అడుగడుగునా గండాలు ఎదుర్కోవలసి రావడంతో అత్యధిక శాతంరైతులు నిలువ్ఞనా అప్పులలో కూరుకుపోతున్నారు. ప్రకృతి ప్రసాదించిన సహజవనరులను కొల్లగొట్టడమే అభివృద్ధి మంత్రంగా ఊరిస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాధినేతలు వర్షాభావం సృష్టించే కరవ్ఞకాటకాల సవాళ్లు ఎదుర్కోలేక నిస్సహాయ నిర్లక్ష్యం ప్రదర్శిస్తు న్నారు. 2015 నాటికే ఆహార ధాన్యాల ఉత్పత్తి రెట్టింపు చేయాల్సిన అగత్యాన్ని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథ న్‌ కమిషన్‌ సూచించింది. 2007లో రైతులకు జాతీయ విధానం నివేదికలో స్వామినాధన్‌ సిఫార్సులు యుపిఎ, ఎన్‌.డి.ఎ ప్రభు త్వాలు పట్టించుకోవడం లేదు. నేషనల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ యాక్ట్‌ అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెంది, లబ్ధిదారు ల ఎంపికలో గందరగోళం సృష్టిస్తున్నాయి.

అధునాతన సాంకేతిక నాగరిక సమాజం, సంపన్నత లక్ష్యంతో సృష్టిస్తున్న జీవన వికృతత్వం,ప్రస్తుతం భారతావనిలో 13 రాష్ట్రా లలో 54 కోట్ల గ్రామీణ సామాన్య నిరుపేద ప్రజానీకాన్ని తిండి గింజలు, పశువ్ఞలకు మేత లభ్యంకాని కరవ్ఞకాటకాల ప్రకృతి వైప రీత్యంతో విలవిలలాడే దుస్థితి సంక్రమింప చేస్తోంది. నిరుపేద గ్రామీణ భారతదేశానికి తాగు,సాగు నీటి,తిండి గింజల కొరత కొత్త కాకపోవచ్చు.స్వాతంత్య్రానంతరం తొలిదశాబ్దంలో అమెరికా నుంచి వచ్చే గోధుమలపై ఆధారపడిన దేశం.క్రమేపీ120 కోట్లజనాభా ప్రాథమిక అవసరాలకనుగుణంగా స్వయం సమృద్ధి సాధించింది. 2016 ప్రస్తుత పర్యావరణ దుష్పరిణామాలు తాగునీటి సంక్షోభంతో గ్రామీణ భారతం కృంగి కృశించే విపత్కరత స్పష్టం చేస్తున్నా యి.స్వరాజ్‌ అభియాన్‌, సెంటర్‌ ఫర్‌ సైన్స్‌, ఎన్విరాన్‌మెంట్‌ (సి. ఎస్‌.యి) డైరె క్టర్‌ జనరల్‌ సునితా నారాయణ్‌ వివరణ ప్రకారం 12 రాష్టాలలో తలెత్తిన కరవ్ఞకాటకాల వైపరీత్యం అత్యంతక్లిష్టమైన సామాన్య నిరుపేద జనజీవితాలకు మృత్యుసంక్షోభం సృష్టిస్తోంది. 1990 నాటి కరవ్ఞకంటే విభిన్నంగా కేవలం అతివృష్టి, అనావృష్టి వాతావరణ దుష్పరిణామాల వల్లే కాకుండా ప్రస్తుత పరిస్థితులు ముందు చూపు తో ప్రణాళికా బద్ధమైన సత్కృషిపట్ల తీవ్ర నిర్లక్ష్యం వల్ల సంభవించే మానవ తప్పిదంగా గుర్తించవలసి వస్తోంది.
– పి.వి.ఆర్‌.మూర్తి