నిరుద్యోగులకు శుభవార్త విడుదలైన గ్రూపు-2 నోటిఫికేషన్‌

TSPSC_LOGO

439 పోస్టుల భర్తీ
హైదరాబాద్‌ : తెలంగాణ నిరుద్యోగులకు భారీ శుభవార్త. వారు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కొలువుల మేళా మొదలైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం మొదటిసారి మొదటిసారి గ్రూపు-2 నోటిఫి కేషన్‌ను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టిఎస్‌పిఎస్‌సి) బుధవారం విడుదల చేసింది. సబ్‌ రిజిస్ట్రార్‌, మున్సిపల్‌ కమిషనర్‌, ఏసిటివో, ఆబ్కా రీ ఎస్‌ఐ పోస్టుల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. దీని ద్వారా మొత్తం 439 పోస్టులను భర్తీ చేయనున్నారు. 2016 ఏప్రిల్‌ 24, 25వ తేదీల్లో జరిగే గ్రూపు-2 పరీక్షకు గురు వారం నుంచి ఫిబ్రవరి 9 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. దీంతోపాటుగా టిఎస్‌పిఎస్‌సీ ద్వారా మరో మూడు నోటిఫికేషన్లు జారీ చేశారు. ఇందులో ప్రధానంగా మరో 350పోస్టులకు కూడా ప్రకటన విడుదల చేశారు.  మెట్రో వాటర్‌వర్క్స్‌ లో డిప్యూటీ మేనేజర్‌ టెక్నికల్‌ గ్రేడ్‌-2 పోస్టులు 44 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ అయింది.  ఈ పోస్టులకు గురువారం నుండి జనవరి 28వ తేదీ వరక దరఖాస్తు చేసుకోవచ్చని కమిషన్‌ పేర్కొంది. ఇంకా టెక్నికల్‌ గ్రేడ్‌-2 అగ్రికల్చర్‌ విస్తరణ అధికారులు 311 పోస్టుల భర్తీకి కూడా ప్రకటన జారీ చేసింది. వీటికి నేటి నుండి జనవరి 25 వరకు దరఖాస్తు స్వీకరించనున్నారు.