నిరుద్యోగులకు చివరికి నిట్టూర్పులేనా?

unemplyment
file

నిరుద్యోగులకు చివరికి నిట్టూర్పులేనా?

రాష్ట్రాలు ఏర్పడ్డాక అనేక ఉద్యోగాలు వస్తాయనే ఆశ తో నిరుద్యోగులు గ్రామీణప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాల వైపు కోచింగ్‌పై మొగ్గుచూపి వలసల మాదిరిగా బయలుదేరి వస్తున్నారు.ఎలాగైనా ఉద్యోగం సంపాదిం చాలనే పేరుతో పేదబడుగు బలహీనవర్గాల విద్యార్థులు, నిరు ద్యోగులు వేలరూపాయలు ఖర్చుచేసి మరి కోచింగ్‌ తీసుకుంటు న్నారు.కానీ గ్రామీణ ప్రాంతాల నుండి వస్తున్న నిరుద్యోగ యువత పట్టణ ప్రాంతాల్లో కోచింగ్‌ సెంటర్ల ఫీజులు దోపిడీ, హాస్టళ్ల ఫీజుల దోపిడీకిఅడ్డంగా దొరికిపోతున్నారు. తల్లిదండ్రులు కష్టపడిప్రతినెల తమ పిల్లలు బాగా చదివి ఉద్యోగం సంపాదిస్తారనే పేరుతో ఖర్చు లకోసం డబ్బులు పంపిస్తే ఇక్కడ ఫీజులు కట్టలేక విద్యార్థులు కోచింగ్‌ సెంటర్ల ఫీజుల దోపిడీ కారణంగా కోచింగ్‌ మధ్యలోనే ఆపేసే పరిస్థితి ఉంది. ఈ రోజు మన రాష్ట్రంలో తమ పిల్లలు బాగా చదివి ఉద్యోగం సంపాదించాలనే నెపంతో తల్లిదండ్రులు కోటి ఆశలతో విద్యార్థు లను పట్టణాలకు పంపిస్తున్నారు. కానీ హైదరాబాద్‌, విజయ వాడ, విశాఖ వంటి పట్టణ ప్రాంతాల్లో అనేక కోచింగ్‌ సెంటర్లలో ఫీజులు దోపిడీ వ్యాపారంగా మారింది తప్ప విద్యార్థులకు ఏమా త్రం ఉపయోగపడటంలేదు. విద్యార్థుల నుండి ముక్కుపిండి 20- 30వేలు మధ్యలో ఫీజులు లాక్కుంటున్నారు. తీసుకున్న ఫీజు లకు ఫలితంగా కనీసం మౌలిక సదుపాయాలు కూడా ఏ ఒక్క కోచింగ్‌ సెంటర్లలో లేదు. ఒకే హాల్‌లో సుమారు ఏడువందల మందికిపైగా విద్యార్థులను కూర్చోబెట్టి బోధిస్తున్నారు.చెప్పేదీ స్పష్టంగా వినబడక విద్యార్థుల్లో కోచింగ్‌పై ఆసక్తి తగ్గి వెనకడుగు వేసి వెళ్లిపోతున్నారు.హైదరాబాద్‌లో మనం చూస్తూనేఉన్నాం. షాపింగ్‌మాల్స్‌లో కూర్చోబెట్టి మరినడిపిస్తున్నారు. కోచింగ్‌ సెంట ర్ల యాజమాన్యాలు విద్యార్థులనుండి లాభాలే ఆశిస్తున్నాయి తప్ప ప్రతి విద్యార్థికి పూర్తిస్థాయిలో కోచింగ్‌ ఇవ్వడం లేదు. సివిల్స్‌, గ్రూప్స్‌,ఎస్‌ఐ, కానిస్టేబుల్స్‌,సిఎ, గేట్‌,టోఫెల్‌, క్యాట్‌ అని అనేక కోచింగ్‌ ల పేర్లతో విద్యార్థులను ఆకర్షించి మోసం చేస్తున్నాయి. ఇక హాస్టల్స్‌ విషయానికొస్తే ఒక నెల రెంట్‌ నుండి పది వేల వరకు దండుకుంటున్నాయి.
విద్యార్థులు తప్పనిసరి పరిస్థితుల్లో అడ్మిషన్‌ అయ్యి ఇటు హాస్టల్‌ఫీజు అటు కోచింగ్‌ ఫీజులు కట్టలేక అప్పులకు గురవ్ఞతున్నారు.తప్ప కోచింగ్‌ కోసంవచ్చి వారు సాధిం చిందేమీలేదు. ఇదిలావ్ఞండగా ఇక పట్టణప్రాంతాల్లో రూమ్స్‌ తీసు కొని చదువ్ఞదామనుకుంటే సుమారు నెలసరి రెంట్‌ 8వేల పైబడే ఉన్నాయి తప్ప పేదవిద్యార్థులకు అందుబాటులో మాత్రం ఎక్కడా లేవ్ఞ. మన ప్రభుత్వాలు ఉద్యోగాలు ప్రకటిస్తామని మాయమాట లు చెప్పి నిరుపేద నిరుద్యోగులను, విద్యార్థులను మరింత ఆర్థికంగా వెనక్కునెట్టేస్తుందే తప్ప వారికి ఎటువంటి ఉపయోగం చేకూర్చడం లేదు.ప్రభుత్వ ఉద్యోగం రాదని తెలిసిన విద్యార్థులు చాలా మంది చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇన్ని సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న నిరు ద్యోగులు చివరికి మన ప్రభుత్వాలు ఉద్యోగాల నోటిఫికేషన్‌ ప్రక టించకా, ప్రకటించిన ఉద్యోగాలు సరిపడక, తీసుకున్న కోచింగ్‌ పూర్తిగా మర్చి పోయి,తిరిగి గ్రామాల్లో పట్టణాల్లో ఉన్న డిగ్రీ పట్టా లు చేతిలోపెట్టుకుని రోడ్లపై తిరుగుతున్న పరిస్థితి మన తెలుగు రాష్ట్రాలలో స్పష్టంగా కనబడుతుంది. నిరుద్యోగులకు ప్రభుత్వ కృషి ఎలా ఉండాలి క్రీడాకారులకు,వాళ్లకు గుళ్లుగోపురాలకు కోట్లరూపాయలు ఖర్చు చేయకుండా నిరుద్యోగులకు రాష్ట్రంలో తక్షణమే ప్రభుత్వ కోచింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలి. వారికి ఉచిత హాస్టల్స్‌ సౌకర్యాలు అందించే బాధ్యత ప్రభుత్వమేచూడాలి.కోచింగ్‌ సెంటర్లలో టీచింగ్‌ ప్రొఫెసర్లతో ఇప్పించే విధంగా చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారంగా ఉద్యోగాల నోటిఫికేషన్‌ విడుదల చేయాలి. కోచింగ్‌ సెంటర్లలో చదివే నిరుద్యోగులకు పుస్తకాలు ప్రభుత్వమే అందించాలి.విచ్చలవిడిగా వ్యాపారమే లాభంగానడిపిస్తున్న కోచింగ్‌ సెంటర్లనూ ప్రభుత్వమే సీజ్‌ చేసి కోచింగ్‌ సెంటర్లలో ఫీజు లిమి ట్స్‌ను ఉంచాలి. ప్రతి వార్డుకు ఒక లైబ్రరీని ఏర్పాటు చేసి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెబుతున్నట్లుగా ఒక లక్ష ఉద్యోగాలు ప్రకటించాలి.ఇలాంటి ప్రయత్నాలు మన ప్రభుత్వాలు తక్షణమే అమలు చేసి పేదబడుగుబలహీనమైన విద్యార్థులకు పూర్తిస్థాయిలో విద్యా,ఉద్యోగం అందించే దిశగా కృషి చేయాలి.

దొడ్డి మల్లేష్‌ (ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటి సభ్యులు)