నిరీక్షించక ముందుకు సాగిపో..

LADY
నిరీక్షించక ముందుకు సాగిపో..

ఏ దేశంలోనైనా మహిళలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక హక్కులు లేనిదే నిజమైన ప్రజాస్వామ్యం ఒనగూరదు. ఏ దేశమైనా సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధిని సాధించడానికి, తన దేశంలో Yసీ జాతి పట్ల అవలంభించే వైఖరికి మధ్య ప్రత్యక్షమైన సంబంధం ఉందని చాలామంది సామాజికవేత్తలు నిర్దంద్వంగా అంగీకరిస్తారు. ఏ సమాజమైనా ఫరిడవిల్లాలంటే అక్కడ Yసీ జాతి అభ్యున్నతి సాధించాలి. మగవాడు తండ్రి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారు కాని Yసీ తల్లి బాధ్యతల నుంచి తప్పించుకోలేదు. మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలను, పథకాలను చేపడుతున్నా ఇంకా వీరు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. కుటుంబ గౌరవహేతువై, దేశంలో సగానికి సగం సంఖ్య గల మహిళలను రక్షణ కల్పించిన నాడే భారత జాతి గౌరవం ఇనుమడిస్తుంది.

సమాజంలో ఒక ప్ఞరుషుడు మాత్రమే చైతన్య వంతుడైతే అతనొక్కడే ప్రయోజనం పొందుతారు. Yసీ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా చైతన్యవంతం కావలసిన అవసరాన్ని తెలియజేస్తుంది. మన సామాజిక నేపథ్యం గ్రామీణ వ్యవస్థ సాంప్రదాయ జీవన శైలులు, Yసీలపై క్రమ శిక్షణను ఆపాదించి కట్టుబాట్లు, ఆచార్య వ్యవహారాలు వంటివి ఆనాది కాలం నుంచి మహిళల ఎదుగుదలకు ఆటంకంగా పరిణమించింది. దేశం అభివృద్ధి చెందాల న్నా కుటుంబం బాగుపడాలన్నా Yసీకి కూడా విద్య అవసరమే అన్న భావన పెరి గింది. మహిళల హక్కులు, సంక్షేమాల కోసం ఎన్నో చట్టాలు చేశారు. Yసీలకు అన్ని రంగాల్లోను రిజర్వేషన్‌ కల్పించారు.. ఏమైనా వరకట్న సమస్య సమసి పోలేదు. Yసీలపై లైంగిక హింసలు, అత్యాచారాలు తగ్గుముఖం పట్టలేదు. ప్ఞరుషుడికి ఒక నీతి Yసీకి ఇంకొక నీతి అనుసరించబడుతుంది. ఈ అసమానతలు నిర్మూలించబడేవరకూ Yసీ వాద ఉద్యమం అవసరం ఉంది. కులాలు, మతాలు, ప్రాంతాలు తేడా లేకుండా అన్ని చోట్ల, అన్ని వేళలా మహిళల పట్ల చిన్న చూప్ఞ చూడడమే జరుగుతున్నది. ఈ మధ్య జరిపిన సర్వేల్లో Yసీలు ఇంటిని, వృత్తిని పురుషుల కన్నా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని తేలింది

. ప్రసార మాధ్యమాల ప్రభావం సమాజంపై చాలా ఉంటుంది. ఇంటర్‌నెట్‌ ద్వారా అశ్లీల సాహిత్యం అందుబాటులో రావడం చాలా ప్రమాదకరంగా మారింది. ప్రసార మాధ్కమాలపై నియంత్రణ ఉండాలి. అశ్లీల దృశ్యాలు, చిత్రాలు ప్రదర్శించ కూడదు. Yసీలకు గౌరవించే కార్యక్రమాలు ప్రసారం చేయాలి. Yసీలకు చైతన్యం కలిగే కార్యక్రమాలు ప్ఞరుషులకు వారు Yసీలతో ప్రవర్తించే విధానంలో మార్పు వచ్చే కార్యక్రమాలు ప్రసారం చేయాలి. Yసీలకు రాజకీయ అవకాశం సమానంగా ఇవ్వాలి. స్వతంత్రంగా వ్యవహరించే స్వేచ్ఛనివ్వాలి. ఓటుబ్యాంకుగా మాత్రమే కాక నాయకత్వ అవకాశాలు కల్పించి ప్రోత్సాహించాలి. రక్షణ వ్యవస్థ, న్యాయవ్యవస్థ, సమర్థవంతంగా నిస్వార్థంగా వివక్షరహితంగా పనిచేయాలి. తమకు తప్పక న్యాయం జరుగుతుందని Yసీలలో నమ్మకం, ధైర్యం కలిగించాలి. ప్రభుత్వం చట్టాలలో మార్పు తేవాలి. చట్టాలలో ఉన్న లొసుగులు న్యాయవ్యవస్థలో జరిగే జాప్యం వల్ల ఎంతోమంది అన్యాయానికి గురవ్ఞతున్నారు. మహిళలు విద్య, ఉద్యోగ, వాణిజ్య రంగాలలో సమాన ప్రాతినిధ్యం జరగాలంటే దేశ శాసన వ్యవస్థను శాసించే పార్లమెంట్‌లో దళిత, గిరిజన, వెనుకబడిన తరగతులు ముస్లింలకు జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్‌ కల్పించినట్లయితే వారు అందించే నిజమైన సహకారం సాధికారత సాధ్యమవ్ఞతుంది. ఆరోగ్యం, వైద్యం, ఆహార భద్రత యొక్క అవసరం ఇప్పుడు బాగా పెరిగింది. ఆహార భద్రత బిల్లు విషయంలో కేంద్రప్రభుత్వం మీన వేషాలు లెక్కిస్తున్నది.

పితృస్వామ్యం పెట్టుబడిదారీ వ్యవస్థకు మరో పేరు. కాబట్టి పితృస్వామ్య వ్యవస్థ పోవాలి. విద్య ఉద్యో గాలలో సమాన ప్రతిపత్తితో పాటు ఆర్థిక స్వాతంత్య్రం కలిగిఉండాలి. సెంటిమెంట్‌కు Yసీని బానిసను చేసి Yసీత్వం ఒక శాపంగా చిత్రించే ప్రవర్తించే కుటుంబ వ్యవస్థలో సమూలమైన మార్పు రావాలి. Yసీలకు విద్యతో పాటు ఆర్థిక స్వాతంత్య్రం కావాలి. Yసీలు సహితం ధైర్యంగా సమస్యలను ఎదుర్కోవాలి. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న చట్ట సభల్లో Yసీల రిజర్వేషన్‌ చట్టం చేయాలి. Yసీల అభ్యున్నతిపై సమాజంలో ఉన్న ప్రతివ్యక్తి నిజాయితీని, నిబద్దతను ప్ఞనఃసమీక్షించుకోవల్సిన అవసరం ఉంది. సమాజం Yసీ ప్ఞరుషులకు సమా నంగా గుర్తించి గౌరవించాలి. ఆడవారి పట్ల వ్యవహరించవలసిన విధానం పట్ల అవగాహన కల్పించాలి. Yసీలకు అన్ని రంగాల్లో ప్రోత్సాహాన్ని, భద్రతను అందించాల్సిన బాధ్యత సమాజానిదే. బెల్టు షాప్ఞలను అదుప్ఞ చేసి ఏరులై పారుతున్న మద్యాన్ని నియంత్రిస్తే మహిళల సంపాదన కుటుంబ, సమాజాభివృద్ధికి ఉపయోగపడుతుంది.

మహిళలు అప్పు తెచ్చుకున్న డబ్బును కూడా దౌర్జన్యంగా తీసుకొని మద్యం షాప్ఞల పాలు చేస్తున్న మగవారిని కట్టడి చేయాలంటే మద్య నియంత్రణ దశల వారీ నిషేధం అవసరం. మహిళల విషయంలో సమాజ దృక్పథం మారనంత వరకూ ఎన్ని చట్టాలున్నా ఆచరణలోకి సఫలీకృతం కాలేకపోతున్నది. కేవలం ఉద్యోగాలు చేసినంత మాత్రాన సమానత్వం సాధించామని భావించలేము. కుటుంబం లోను, సామాజికంగానూ నిర్ణయాధికారంలో భాగం లేనంతవరకూ Yసీలకు గృహహింస నిరోధక చట్టం, వరకట్న నిషేధ చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, పని ప్రదేశాలలో లైంగికవేధింప్ఞల నిరోధక చట్టం, అత్యాచార బాధితులకు నిర్భయ చట్టం ఎన్ని చట్టాలున్నాయి. కానీ ఆచరణలో చట్టాన్ని అమలుచేయాల్సిన పోలీప్ఞ న్యాయవ్యవస్థలో Yసీ ప్ఞరుషులు సమానమనే దృక్పథం లోపించడం వల్ల చట్టాలు అధిక శాతం సందర్భాలలో కాగితాలపైననే మిగిలిపోతున్నాయి. మహిళా సాధికారత ప్రాప్తిక విద్య, సామాజిక న్యాయం, మెరుగైన ఆరోగ్యం, ఆర్థిక స్థిరత్వం, రాజకీయ భాగస్వామ్యం, ప్రధాన సాధనాలు. మహిళ సాధికారత కల్పించకుండా నిర్ణయాలు చేయడంలో వారికి అధికారం కల్పించాలి.