నిరాహార దీక్ష చేయనున్న చంద్రబాబు

AP CM BABU
AP CM BABU

గుంటూరు: రాష్ట్ర సమస్యలు, కేంద్ర వైఖరికి నిరసనగా నిరాహార దీక్ష చేయనున్నట్లు ఏపి సియం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ నెల 20న తన పుట్టినరోజున నిరాహార దీక్ష చేస్తానని వెల్లడించారు. నమ్మక ద్రోహం, కుట్రల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో ఈ నెల 30న తిరుపతిలో బహిరంగ సబ నిర్వహించనున్నట్లు తెలిపారు. అంబేద్కర్‌ జయంతి వేడుకల సందర్భంగా గుంటూరు జిల్లాలోని శాఖమూరులో రూ. 100 కోట్లతో 20 ఎకరాల్లో నిర్మించబోయే అంబేద్కర్‌ స్మృతివనం ఆకృతిని సియం ఆవిష్కరించారు. రాష్ట్రానికి అన్యాయం చేసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు.