నిరాశ మిగిల్చిన రిజర్వు బ్యాంకు

RBI1
RBI1 Governer Urjit patel

నిరాశ మిగిల్చిన రిజర్వు బ్యాంకు

ముంబయి: ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న అంచనా లతో రిజర్వుబ్యాంకు తన ద్వైమాసిక ద్రవ్యవిధాన సమీక్షలో రెపోరేట్లను యధాతథంగా కొనసాగించాలనే నిర్ణయించింది. ఇన్వెస్టర్లు, మార్కెట్‌ నిపుణులు, కార్పొరేట్‌, పారిశ్రామిక రంగాలను నిరాశపరిచిందనే చెప్పాలి. గడచిన ద్వైమాసిక సమీక్షలో కూడా ఆర్‌బిఐ తన వడ్డీరేట్లను యధాతథంగానే కొనసాగించింది.

రెపోరేట్లను 6.25శాతంగా నిర్ణయించింది. ఇప్పటికి మూడోసారి రెపోరేట్లను స్థిరంగా కొనసాగించిన రిజర్వుబ్యాంకు రానున్న కాలంలో రుతుపవనాలు సరైన అంచనాలు ఇవ్వకపోవడం వల్ల వ్యవసాయదిగబడుల ఆధారం గా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని, ఆర్‌బిఐ లక్ష్యాలకు అనుగుణంగా ఉండకపోవచ్చనే అంచనావేసింది. మొత్తం 60 మంది ఆర్థికవేత్తలు కూడా ఆరుగురు సభ్యులునన రిజర్వు బ్యాంకు మానిటరీపాలసీ కమిటీ రెపోరేట్లను స్థిరంగానే కొన సాగిస్తుందని అంచనావేసారు. నైరుతిరుతుపవనాల గమ్యం కొంత అనిశ్చితంగా ఉందని అందువల్లనే ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలున్నట్లు అంచనావేసింది.

అలాగే నైరుతి పరిసరా ల్లోని రుతుపవనాలు కూడా ఎల్‌నినో ప్రభావంతో ఉంటా యని, జూలై – ఆగస్టు నెలల్లో ఈ ప్రభావం ఉండటం వల్ల ఆహారద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని ఆర్‌బిఐ అంచనా వేసింది. ఏడో వేతన సంఘం సిఫారసులు కూడా కొంత కార ణం అయ్యాయి. ఇంటి అద్దెభత్యాన్ని పెంచిన పక్షంలో బేస్‌ లెన్‌ భారం 100నుంచి 150 బేసిస్‌ పాయింట్లుగా ఉంటుం దని, 12 నుంచి 18 నెలలపాటు ఈ భారం కొనసాగుతుందని అంచనావేసింది. అలాగే జిఎస్‌టిఅమలుద్వారా కూడా ప్రారం భంలో కొంత సమస్యలు ఉత్పన్నం అవుతాయని ఆర్‌బిఐ అం చనా వేసింది. రివర్స్‌ రెపోరేట్‌ను కూడా 25బేసిస్‌ పాయిం ట్లు తగ్గించి ఆరుశాతం వద్దనే నిలిపింది. రెపో, రివర్స్‌రెపో రేట్‌లమధ్య తేడా 25 బేసిస్‌ పాయింట్లుగా ఉంది. అయితే ఈ నిర్ణయం బ్యాంకింగ్‌ రంగానికి సానుకూలంగా ఉంటుందని ప్రకటించాయి. ఎన్‌ఎస్‌ఇ బ్యాంకింగ్‌ సూచి ఈ నిర్ణయంతో అంతకుముందున్న నష్టాల నుంచి రికవరీ అయింది. ఆర్‌బిఐ వినియోగరంగ ద్రవ్యోల్బణం సగటున 4.5శాతంగా ఉంటుం దని, రెండో అర్ధసంవత్సరంలో ఐదుశాతంగా ఉంటుందని అంచనావేసింది.

అలాగే ఆర్‌బిఐ ఇకపై రానిబాకీలు రికవరీకి కార్యాచరణ షురూచేస్తున్నట్లు ప్రకటించింది. ద్రవ్యోల్బణం పెరిగే సూచనలున్నప్పటికీ రెపోరేట్లపై నిర్ణయాలు తప్పవని బ్యాంకు గవర్నర్‌ ఉర్జిత్‌పటేల్‌ వెల్లడించారు. మానిటరీ పాలసీ కమిటీ వడ్డీరేట్లను స్థిరంగానే కొనసాగించేందుకు నిర్ణయించిం ది. పాలసీపై ఎంపిసి తటస్థ విధానం అనుసరించిందనే చెప్పాలి. ద్రవ్యోల్బణం పెరిగే అవకాశంఉందని, నాలుగో త్రైమాసికంలో ఐదుశాతంగా ఉంటుందని ప్రకటించింది.

2017-18లో ద్రవ్యోల్బణం 4.5శాతం మొదటి ఆరు నెలల్లోను, ఐదుశాతం రెండో అర్ధసంవత్సరంలో కొన సాగుతుందని అంచనా. మానిటరీపాలసీ ప్యానెల్‌ స్థూల విలువల జోడింపు వృద్ధి 7.4శాతంగా ఉంటుందని అం చనా వేసింది. 2017-18 సంవత్సరంలో కూడా ద్రవ్యో ల్బణం పెరిగే సూచనలు మెండుగా ఉన్నాయని, రెండో అర్ధసంవత్సరంలో మరికొంత నిరాశ ఉంటుందని అంచనా వేసింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్నందుననే రెపోరేట్లు పెంచేందుకు అవకాశంలేదని అంచనా. ఆర్థిక వ్యవస్థలో పెద్దనోట్ల రద్దు అనంతరం భారీగా నగదు అందుబాటులోకి వచ్చింది. ఆర్‌బిఐ పెద్దనోట్లు రద్దుతో వచ్చిన ద్రవ్యలభ్యతను బ్యాంకింగ్‌ వ్యవస్థకు సర్దుబాటు చేసింది.

గరిష్టస్థాయిలో ద్రవ్యసర్దుబాటులో సుమారు 8 లక్షలకోట్లుగా ఉన్నట్లు అంచనా. మార్చి నెల చివరి నాటికి ద్రవ్యసర్దుబాటు 3.1 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. పెద్దనోట్ల రద్దుతో బ్యాంకింగ్‌ రంగానికి మంచి మూలధనవనరులు లభించినట్లయింది. ఇక వ్యవసాయ రుణాల రద్దువల్ల రుణపరపతి సంస్కృతికి కొంత విఘా తం కలిగిస్తుందని దీనివల్ల పన్నుచెల్లింపుదారుల సొమ్ము బదిలీ అవుతుందని రిజర్వుబ్యాంకు వ్యాఖ్యలు చేసింది.