నియామకాల్లో 15శాతం వృద్ధి

Naukri
హైదరాబాద్‌ : హైదరాబాద్‌ పరిసరాల్లో నియామకాలు ఫిబ్రవరి నెలలో గత ఏడాది కంటే 15శాతం పెరిగాయి. ఐటిసాఫ్ట్‌వేర్‌ రంగాల్లో 28శాతం పెరుగుదల ఉంది. ఐటి సేవలరంగ పరంగా కూడా 26శాతం వృద్ధి కనిపిస్తోంది. ఇక మార్కె టింగ్‌ వృత్తినిపుణుల నియామకాల్లో 15 శాతం పెరిగినట్లు నౌకరీ జాబ్‌స్పీక్‌ వెల్లడించింది. ఐటి సాఫ్ట్‌వేర్‌, ఫార్మా, ఐటిఇఎస్‌రంగాల్లో 28 శాతం, 12శాతం, 17శాతంవృద్ధి ఉంది. ఇక బ్యాంకింగ్‌ ఫైనా న్షియల్‌ సేవల రంగం పరంగా ఐదు శాతం క్షీణించింది. అకౌంటింగ్‌ వృత్తి నిపుణుల నియామకాలు తగ్గాయి. ఐటి సేవల రంగం, ఐటి సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో కూడా 27శాతం, 26శాతం, 21శాతంగా వృద్ధి ఉంది. నౌకరి ముఖ్య విక్రయాల అధికారి వి.సురేష్‌ మాట్లాడుతూ ముత్యాల నగరంలో మొత్తంగా నియామకాల పరంగా 15శాతం వృద్ధి ఉంది.  అకౌంటింగ్‌ రంగ పరంగా ఎక్కువ డిమాండ్‌ ఉంది. ఐటి సాఫ్ట్‌వేర్‌, లీగల్‌ రంగాల కు 28శాతం, 23శాతం వృద్ధి కనిపి స్తోంది. రియల్‌ఎస్టేట్‌, టెలికాం రంగాల్లో కూడా సానుకూల వృద్ధి ఉన్నట్లు అంచనా. అకౌంట్స్‌, ఐటిఇఎస్‌, ఐటి సాఫ్ట్‌వేర్‌ రంగాలే ఎక్కువ ప్రకాశిస్తున్నాయి. అమ్మకాల రంగంలో 15 శాతం,ఫార్మారంగంలో 9శాతంగావృద్ధి నమోదయింది.