నిమ్స్ లో స్వ‌ల్ప అగ్ని ప్ర‌మాదం

NIMS HYd
NIMS, HYd

హైద‌రాబాద్ః పంజాగుట్ట‌లోని నిమ్స్ ఆస్పత్రిలో సోమవారం ఉదయం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. ఏసీలో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆస్పత్రిలోని రోగులు, బంధువులు ఆందోళనకు గురయ్యారు. మంటలు అదుపులోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.