నిమ్మగడ్డపై రోజా విమర్శలు
mla roja
అమరావతి: ఎమ్మెల్యే రోజా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. నిమ్మగడ్డకు చిన్న మెదడు చితికిపోయినట్టుందన్నారు. తనకు కావాల్సిన అధికారులను నియమించుకున్న తరువాత కూడా ఏకగ్రీవాలను ఆపటం ఆయనపై ఆయనకు నమ్మకం లేదనిపిస్తోందని చెప్పారు. ప్రజల తీర్పును గౌరవించకపోతే బాగుండదని రోజా పేర్కొన్నారు. గుంటూరు, చిత్తూరు కలెక్టర్లకు ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చింది. ఏకగ్రీవాలను వెంటనే ప్రకటించొద్దని, ఫిర్యాదులు పరిష్కరించాకే ఫలితాలు ప్రకటించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశించారు. ఫిర్యాదులపై నివేదిక పంపాలని కలెక్టర్లను ఎన్నికల కమిషన్ కోరింది. లోపాలు ఉన్నట్లు తేలితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని నిమ్మగడ్డ హెచ్చరించారు. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో భారీగా ఏకగ్రీవాలు జరిగినట్లు గుర్తించామన్నారు. జిల్లాల్లో ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్లు, ఎస్పీలను ఎస్ఈసీ అభినందించారు.