నిమ్న జాతి వారిని అణగదొక్కేందుకు కుట్రలు

Manda Krishna
Manda Krishna

హైదరాబాద్‌: దళిత, గిరిజనులను అణగదొక్కేందుకు కుట్రలు జరుగుతున్నాయని, డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కల్పించిన హక్కులను కేంద్రం బలహీనపరుస్తుందని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు వెనుక కేంద్రం హస్తం ఉందన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు తమ పోరాటాన్ని విస్తరిస్తామని మందకృష్ణ అన్నారు. వరంగల్‌లో భారీ ఎత్తున సింహగర్జన సభ నిర్వహిస్తామని ,సింహగర్జనకు ముందు హైదరాబాద్‌, అమరావతిలో సన్నాహక సదస్సులు జరుపుతామని ,సింహగర్జన సభకు దళిత, గిరిజన నేతలను ఆహ్వానిస్తామని మందకృష్ణ స్పష్టం చేశారు.