నిబంధనలకు లోబడే ఎన్నికలు నిర్వహిస్తాం

V. NAGI REDDY
V. NAGI REDDY

డిసెంబరు 31 తరువాత ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేము సిద్దం
అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి
హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా పంచాయితీ ఎన్నికలను నిబంధనలకు లోబడే నిర్వహించనున్నట్లు, డిసెంబరు 31వ తేది తరువాత ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేము సిద్దంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ఆయన జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. పంచాయితీ ఎన్నికలకు సంబంధించి మే 2018లోనే పూర్తిచేశామని, అసెంబ్లీ ఎన్నికలు రావడంతో పంచాయితీ ఎన్నికలు వాయిదా పడ్డాయన్నారు. బ్యాలెట్‌ పేపర్లు కూడా ప్రింట్‌ చేశామన్నారు. కొత్త స్టాఫ్‌కు శిక్షణ ఇస్తామన్నారు. అసెంబ్లీ జాబితాను అనుసరించి గ్రామపంచాయితీ ఎన్నికలు జరుగుతాయన్నార. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలకు ఓటర్ల జబితాను పంపిచామన్నారు.