నిధుల సమీకరణకు మార్కెట్‌లోకి ఐపిఒలు

stocks
stock market

న్యూఢిల్లీ: దేశీయ స్టాక్‌ మార్కెట్‌లోకి మూడు ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్లు (ఐపిఒ) రానున్నాయి. సుమారు 6,600 కోట్ల రూపాయల నిధుల సమీకరణ టార్గెట్‌గా ఈ మూడు ఐపిఒలు వస్తుండగా, మ్యాట్రిమొని డాట్‌కామ్‌, క్యాపసిటి ఇన్‌ఫ్రా ఫ్రాజెక్ట్‌, ఐసిఐసిఐ లాంబార్డ్‌ సంస్థలు వీటిలో ఉన్నాయి. ఈనెల 13 వరకు మ్యాట్రిమొని డాట్‌కామ్‌, 15 వరకు క్యాపసిటి ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్‌, 19 వరకు ఐసిఐసిఐ లాంబర్డ్‌ ఐపిఒలు రానున్నాయి. మ్యాట్రిమోని డాట్‌కామ్‌ ఐపిఒ టార్గెట్‌ 500 కోట్ల రూపాయలకు పైగా ఉండగా, క్యాపసిటీ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్‌ ఐపిఓ టార్గెట్‌ 5,700 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక మ్యాట్రిమొని డాట్‌కామ్‌ షేర్ల ధరల శ్రేణి 983-985 రూపాయలుగా ఉంటే క్యాపసిటి ఇన్‌ప్రా ప్రాజెక్ట్స్‌ షేర్ల ధరల శ్రేణి 245-250 రూపాయలుగా, ఐసిఐసిఐ లాంబర్డ్‌ షేర్ల ధరల శ్రేణి 651-661 రూపాయలు ఉన్నాయి.