నిధుల ఆరోప‌ణ‌ల్లో నికోల‌స్‌

Nicolas Sarkozy
Nicolas Sarkozy

పారిస్ : ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీని ఆ దేశ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లిబియా మాజీ నేత కల్నల్ మొహమ్మద్ గడాఫీ నుంచి నిధులు తీసుకున్నారన్న కేసులో సర్కోజీని విచారిస్తున్నారు. 2007లో దేశాధ్యక్ష పదవి కోసం ప్రచారం చేస్తున్న సమయంలో సర్కోజీ .. లిబియా నుంచి అక్రమంగా నిధులు సమీకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో పోలీసులు ఇదే కేసులో అయన్ను ప్రశ్నించారు. అయితే 2012లో జరిగిన ఎన్నికల్లో రెండవ సారి పోటీ చేసిన ఆయన ఓడిపోయారు.