నిధులు లేక జీహెచ్‌ఎంసీలో అభివృద్ధి జరగడం లేదు: జగ్గారెడ్డి

Jaggareddy
Jaggareddy

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి బుధవారం మీడియాతో మట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిధులు లేక  జీహెచ్‌ఎంసీలో అభివృద్ధి జరగడం లేదని ఆరోపించారు. నగరంలో వర్షాలు, ట్రాఫిక్‌తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు  ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. మిషన్‌ కాకతీయలో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని, లంచగొండుల గురించి కేసీఆర్‌ మాట్లాడటం హాస్యాస్పందంగా ఉందని, లంచాలు తీసుకుంటున్నారని తెలిసినా ఏమీ చేయని సీఎం కేసీఆర్‌ని ప్రజలు  తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.