నిద్ర లేని రాత్రులు గడిపాను

karan johar
karan johar

ముంబై: ప్రముఖ బాలీవుడ్‌ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్‌ కరణ్‌’ షో వల్ల క్రికెటర్లు హార్ధిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌ కెరీర్‌ చిక్కుల్లో పడింది. షో లో ఆడవారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను వీరిద్దరిని బిసిసిఐ సస్పెండ్‌ చేసింది. దీనిపై కరణ్‌ స్పందించారు. అది తన షో కాబట్టి తానే బాధ్యత వహించాలని , తాను వారిని అతిథులుగా ఆహ్వానించానని, కాబట్టి తన షోలో జరిగే పరిణామాలకు తానే బాధ్యుడునని అన్నారు. ఈ ఘటన వల్ల తాను నిద్ర లేని రాత్రులు గడపాల్సి వచ్చిందని బాధపడ్డారు. ఇప్పుడు పరిస్థితి తన చేయి దాటిపోయిందని ,తనను క్షమించమని ఆవేదన వ్యక్తం చేశారు.