నిద్ర అవసరం!

తెలుసుకో

SLEEPING
SLEEPING

నిద్ర అవసరం!

నిద్ర అవసరం అందరికీ ఒకేలా ఉండదు. ప్రధానంగా వయసును బట్టి ఆ సమ యాలు మారుతూ ఉంటాయి. మామూలుగా అయితే ఏడాదిలోపు పిల్లలు రోజుకు 16 నుంచి 20 గంటలు నిద్రిస్తారు. పదేళ్లు వచ్చేసరికి వారి నిద్ర 10 గంటలకు తగ్గుతుంది. యుక్తవయస్కులకు 7 నుండి 8 గంటలు, మధ్య వయస్కులకు 6 నుంచి 7 గంటల నిద్ర అవసరమవ్ఞతుంది. ఇక వృద్ధాప్యం వచ్చేసరికి 6 గంటలు లేదా అంతకన్నా తక్కువే సరిపోతుంది. అయితే ఇవన్నీ సగటు లెక్కలే గానీ, అందరికీ ఏక సూత్రంగా ఏమీ చెప్పలేం. నిద్రలేమి సమస్య ఉందని చెప్పే వారిలో వృద్ధులే ఎక్కువగా ఉంటారు. వయసు పైబడే కొద్దీ సహజంగానే నిద్ర అవసరం తగ్గు తుందని వీరిలో చాలా మందికి తెలియదు. నిద్ర సరిపోయిందో లేదో తెలియడానికి పగటి వేళ ఆ వ్యక్తి ఉత్సాహంగా ఉండడమే రుజువ్ఞ. పగటి పూట కునికి పాట్లు పడుతూ ఉంటే ఆ వ్యక్తికి నిద్ర సరిపోలేదని అర్ధం.