నిదానమే ప్రధానం

EATING1
EATING1

నిదానమే ప్రధానం

ఆహారం కాస్త నెమ్మదిగా తింటే త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుందని, పదార్థాలు కూడా మరింత రుచికరంగా అనిపిస్తాయని మొట్టమొదటిసారిగా శాస్త్రీయంగా నిరూపించారు పరిశోధకులు. దేహంలో కొవ్ఞ్వ తగ్గాలంటే ఏం చెయ్యాలన్నది ఇప్పుడు ప్రపంచ ప్రశ్న. దీనికి సమాధానం కోసం ఇటు ప్రజలు, ఇటు పరిశోధకులు కూడా రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందుకు ఆహారాన్ని నిదానంగా, మెల్లగా ఆస్వాదిస్తూ తినటం కూడా ఉత్తమ మార్గమని పరిశోధకులు వివరిస్తున్నారు. ఆహారాన్ని గబగబా ముక్కూనోటా కుక్కుకోకుండా నిదానంగా తింటే కొద్దిగా తినగానే కడుపు నిండిన భావన,

తృప్తి కలుగుతుందని పరిశోధకులు గుర్తించారు. రోడ్‌ ఐలండ్‌ యూనివర్శిటీ పరిశోధకులు దీనిపై చాలా అధ్యయనాలు చేశారు. వీరు కొందరికి పెద్ద పెద్ద చెంచాలు ఇచ్చి, గబగబా వేగంగా తినమని సూచించారు. ఇలా తిన్నప్పుడు వాళ్లు 9నిమిషాల్లోనే 646 కేలరీల ఆహారం తిన్నారు. తర్వాత మరోరోజు వాళ్లకు చిన్న స్పూన్లు ఇచ్చి, నిదానంగా నములుతూ మెల్లగా తినమని సూచించారు. ఈ దఫా వాళ్లు దాదాపు 29నిమిషాలు తిన్నారు గానీ మొత్తం మీద తిన్న కేలరీలు మాత్రం 579 దాటలేదు. నిదానంగా తిన్నపుడు వాళ్లు తక్కువ కేలరీలు తీసుకోవటమే కాదు. ఎక్కువ తృప్తి కూడా పొందారు. చాలా త్వరగా వారికి కడుపు నిండిన భావన కలిగింది. కాబట్టి రోజూ కుదురుగా కూర్చుని, ఆహారాన్ని నిదానం గా తినటం వల్ల బరువ్ఞ తగ్గటమే కాకుండా శరీరాకృతిని కూడా చక్కగా అదుపులో ఉంచుకోవచ్చని పరిశోధకులు డా. కేథలీన్‌ మెలాన్సన్‌ సూచిస్తున్నారు. ్పు