నిత్యానంద ను పెళ్లి చేసుకోవాలని ఉందంటున్న రానా హీరోయిన్..

శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన లీడర్ మూవీ తో తెలుగు ఇండస్ట్రీ కి పరిచమైన ప్రియా ఆనంద్‌ కు నిత్యానంద స్వామిని పెళ్లి చేసుకోవాలని ఉందట. ఈ విషయాన్నీ స్వయంగా ఆమెనే తెలిపింది. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పెళ్లి ప్రస్తావన రాగ ఇలా స్పందించింది. నిత్యానంద స్వామి అంటే నాకు ఎంతో ఇష్టం.. ఆయన దగ్గర ఏదో ప్రత్యేకత ఉంది కాబట్టి అందరూ ఆయనను ఇష్టపడతారు అంటూ చెప్పుకొచ్చింది. పెళ్లి చేసుకుంటే అతన్ని చేసుకుంటానని షాకింగ్ కామెంట్స్ చేసింది. నిత్యానంద్​ గురించి ఎలాంటి ప్రచారం జరుగుతున్నా వేలాది మంది భక్తులు ఆయన్ను ఇంకా ఆరాధిస్తున్నారని, ఆయన్ను పెళ్లి చేసుకుంటే తనకు పేరు మార్చుకోవాల్సిన అవసరం కూడా లేదని చెప్పింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేసిన ‘లీడర్'( 2010) చిత్రం ద్వారా ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అటు తర్వాత రామ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రామ రామ కృష్ణ కృష్ణ’, సిద్దార్థ్ హీరోగా తెరకెక్కిన ‘180’ , శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ‘కో అంటే కోటి’ వంటి క్రేజీ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది. కొత్త హీరోయిన్ల రాకతో అమ్మడికి ఛాన్స్లు తగ్గడం తో తమిళ్ చిత్రసీమలో అడుగుపెట్టి శివకార్తికేయన్, అధర్వ, విక్రమ్ ప్రభు, గౌతమ్ కార్తీక్, ఆర్జే బాలాజీ లాంటి హీరోల సరసన నటించింది. చివరిసారిగా పునిత్​ రాజ్​కుమార్​ ‘జేమ్స్’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించింది.