నితిన్‌ సినిమాలో విలన్‌ గా అర్జున్‌

ARJUN11
అర్జున్‌, హను రాఘవపూడి, అనిల్‌ సుంకర

నితిన్‌ సినిమాలో విలన్‌ గా అర్జున్‌

 
యూత్‌స్టార్‌ నితిన్‌ హీరోగా వెంకట్‌ బోయినపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర ప్రొడక్షన్‌ నెం.9గా నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ విలన్‌గా నటిస్తున్న నేపథ్యంలో జనవరి 16న హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను తెలిపేందుకు విలేరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, దర్శకుడు హను రాఘవపూడి, నిర్మాతలు గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. నిర్మాత అనిల్‌ సుంకర మాట్లాడుతూ.. ఈ సినిమాలో సీనియర్‌ నటుడు అర్జున్‌ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. సినిమాలో ఇది చాలా కీలమైన పాత్ర. దీనికోసం మూడు నెలలు ఆలోచించాం. అర్జున్‌ గారు మాత్రమే ఈ పాత్రకు న్యాయం చేయగలరనిపించింది. చాలా స్టైలిష్‌ గా ఉండే రోల్‌. ఈ సినిమాతో తెలుగులో మరోసారి ఆయన మార్క్‌ ను క్రియేట్‌ చేయడం ఖాయం అన్నారు

దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ.. నాలుగు నెలల క్రితం కథ రాసుకుంటున్నప్పుడు..అర్జున్‌ గారి పాత్రలో ఆయన్ను తప్ప మరెవరిని ఊహించుకోలేకపోయాను. చిన్నప్పుడు యాక్షన్‌ సినిమాలు బాగా చూసేవాడ్ని. ఆయన జెంటిల్‌ మెన్‌ సినిమా చూసి ఫ్యాన్‌ అయిపోయాను. అదృష్టం కొద్దీ ఈ సినిమాలో ఆయనతో కలిసి పని చేసే అవకాశం వచ్చింది. ఇది ఆయనతో మొదలయ్యే కథ. తన కథ.. టెరిఫిక్‌ రోల్‌. అర్జున్‌ గారు తప్ప మరెవరూ చేయలేరనిపించింది. మొదట ఆయనకు ఈ కథ చెప్పడమే పెద్ద టాస్క్‌. ఒప్పుకుంటారో.. లేదొ అనుకున్నాం. కానీ ఆయన కథ విని ఓకే చెప్పగానే ఎంతో ఎగ్జైట్‌ అయ్యాను. ఆయన అడుగు సినిమాను మొత్తం మార్చేస్తుంది. నా లైఫ్‌ టైమ్‌ లో రాసిన బెస్ట్‌ రోల్‌ ఇదే అవుతుంది అన్నారు.

సీనియర్‌ నటుడు అర్జున్‌ మాట్లాడుతూ.. నటుడికి మంచి పాత్ర వచ్చినప్పుడు ఎంతో ఎగ్జైట్‌ అవుతారు. ఈ రోల్‌ వినగానే నేను ఎంతగానో ఎగ్జైట్‌ అయ్యాను. రెండు నెలల్లో ఓ పాతిక కథలు విన్నాను. కానీ ఏ కథ నన్ను ఎగ్జైట్‌ చేయలేదు. ఈ కథ నచ్చింది. ఈ క్యారెక్టర్‌ గురించి చెప్పాలంటే ది హైట్‌ అఫ్‌ సొఫెస్టికేషన్‌, ది హైట్‌ ఆఫ్‌ ఇంటెలిజెన్స్‌… ఇవన్నీ వున్నాయి. ఒకేఒక్కడు, జెంటిల్‌ మెన్‌ సినిమాలతో ఎటువంటి గుర్తింపు లభించిందొ.. ఈ సినిమాతో అంత మంచి గుర్తింపు లభిస్తుంది అన్నారు.