నిజాన్ని నిగ్గు తేల్చండి

CUTE-1
CUTE-1

నిజాన్ని నిగ్గు తేల్చండి

మనం ఎన్నో అనుకుంటాం. మనకు కొన్ని అభిప్రాయాలు, భావాలు, అనుభూతులు ఉంటాయి. అంటే ఎవరి ఫీలింగ్స్‌ వారి కుంటాయన్న మాటేగా, ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి. సాధారణంగా నలుగురు కలిసి మాట్లాడుకుంటున్నపుడు రకరకాలుగా తమ తమ అభిప్రాయాలను వెలిబుచ్చుతుంటారు. అలాంటి సమయంలో ఒకరి అభిప్రాయాలు మరొకరికి నచ్చనపుడు ‘నువ్ఞ్వ చెప్పిన అభిప్రాయంతో నేను ఏకీభవించలేకపోతున్నాను నా అభిప్రాయం ఇది.

నేనిలా అనుకుంటున్నాను అంటూ ఖచ్చితంగా చెప్పేవారు కొందరుంటారు. చెప్పలేక మొహమాటపడి ఓ.కె. మీరు చెప్పింది బాగానే ఉంది అని ఆ సంభాషణను అక్కడితే తుంచేసేవారు కొందరుంటారు. నిజానికి ఒకరి అభిప్రా యాలను ఒకరు కలబోసుకోవడంలో తప్పులేదే. అందరి అభిప్రాయాలను వినడం వలన ఏదైనా కొత్త ఆలోచన రావచ్చు. కొత్త పాయింటు తెలుసుకొనే అవకాశం ఉంది. కొత్త ప్రణాళిక రూపుదిద్దుకోవచ్చు. ఒకోసారి కొన్ని సందర్భాలలో అప్పటి పరిస్థితుల కనుగుణంగా తప్పుడు అభిప్రాయానికి రావచ్చు. తప్పనిసరిగా అది తప్పని తెలిశాక దాన్ని మార్చుకోవల సిన అవసరం ఎంతైనా ఉంది కదా. అందువలన అభిప్రాయాలు విషయంలో ఒకోసారి ఖచ్చితంగా, నిబద్ధతగా ఉండలేం. మార్చుకోవాల్సి వచ్చినపుడు మనం బాధపడకూడదు. సంతోషపడాలి.

అలాగే రూపాన్ని చూసి, వేషభాషల్ని చూసి, వస్త్రధారణని చూసి, అలంకరణని చూసి మొత్తంగా వారి స్లైల్‌ని చూసీ చూడగానే వెంటనే ఓ అభిప్రాయానికి రాకూడదు. మనం ఎవరి గురించైనా ఓ అభిప్రాయానికి రావాల్సి వచ్చినపుడు ఆ వ్యక్తితో మనం కాసేపన్నా గడపాల్సి ఉంటుంది. అపుడే ఆ వ్యక్తి తీరు తెన్నుల గురించి ఓ అవగాహన కలుగుతుంది. అలాగే ఏదైనా విషయం గురించి అభిప్రాయం చెప్పాల్సి వచ్చినపుడు దాని పూర్వాపరాలను కూలంకషంగా పరిశీలించాలి.

అపుడే అందులో ఉన్న లోటుపాట్లేమిటో తెలుస్తాయి. ఏవీ తెలియకుండా పైపైన తెలుసుకుని అదే అభిప్రాయాన్ని అందరికీ చెప్పి నమ్మించాలని చూడకూడదు. ఆ తర్వాత నిజం తెలిస్తే మీరు నింద భరించవలసి వస్తుంది. ఆయా ఛానళ్లలో ఒకే అంశంపై రకరకాల కోణాల్లో వార్తలు చదువ్ఞతుంటారు. ఏది వింటే అదే కరెక్ట్‌ అన్న అభిప్రాయానికి రాకూడదు.