నిజంగా రాణినే..

TAMANNAH-44
TAMANNAH

నిజంగా రాణినే..

టాలీవుడ్‌ మిల్కీ బ్యూటీగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌ తమన్నా… ప్రస్తుతం అమ్మడు భాషాభేదం లేకుండా అన్ని ఇంస్ట్రీస్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.. అయితే కొంతకాలంగా తమన్నాకి సరైన విజయాలు అందటం లేదు. కానీ ఎలాగైనా ఒక హిట్‌తో మళ్లీ తన వైభవాన్ని చూపించాలని అనుకుంటోంది..
అందుకే ఈసారి లేడీ ఓరియెంటెడ్‌ సినిమాతోరాబోతోంది.. బాలీవుడ్‌లో కంగనా రనౌత్‌ నటించిన క్వీన్‌ చిత్రాన్ని తెలుగు రీమేక్‌ చేయటానికి సిద్ధమైంది.. ప్రముఖ దర్శకుడు నీలకంఠ ఆ కథను తెలుగులో తెరకెక్కిస్తున్నారు.. అక్టోబర్‌ 1నుంచి హైదరాబాద్‌లో ఈసినిమా రెగ్యులర్‌షూటింగ్‌ ప్రారంభమైంది.. ఈ సందర్భంగా తమన్నా కొన్ని విషయాలను మీడియాతో పంచుకుంది.. క్వీన్‌ రీమేక్‌ లో నటించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని, నేను నిజ జీవితంలో కూడ స్వేచ్ఛగా రాణిలాగే ఉండటానికి ఇష్టపడుతాను.. అదే తరహాలో ఈసినిమాకు కూడ అలాగే ఉంటుందని చెప్పింది.. మహిళ స్వేచ్ఛకు సంబంధించిన సినిమాలోల నటించటానికిఎప్పుడైనా సిద్ధమే అని చెప్పింది.. అలాంటి స్క్రిప్టులు ఉంటే చేయటానికి ఎక్కువగా ఆసక్తిచూపుతాను అని పేర్కొంది.. ఈ సినిమాలో స్క్రీన్‌ప్లే నాకు ఎక్కువగా నచ్చింది.. హిందీలో కంగనా కూడ చాలా బాగా నటించింది.. తెలుగులో కూడ నాస్థాయి వరకు నేను నటిస్తాను.. అని మిల్కీ బ్యూటీ చెప్పింది. అయితే తమన్నా ఈ సినిమాలో కొత్త ఆకృతిలో కన్పించనుందనట.. ఈసినిమాతోపాటు అమ్మడు రెండుచిత్రాల్లో నటిస్తోంది.. కల్యాణ్‌రామ్‌ హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమా, తమిళ్‌లో మరొక సినిమాలో నటిస్తోంది.. కాగా విక్రమ్‌తో నటించిన ‘స్కెచ్‌ రిలీజ్‌కు రెడీగా ఉంది.