నిఘా లోపమే

Police Rides
Police 

నిఘా లోపమే

హైదరాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలలో శుక్రవారం లంబా డీలు, ఆదివాసీల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణలకు దారి తీసి, హింసాత్మకంగా మారి ఇద్దరి మృతికి దారి తీసిన ఘటనలపై ముందస్తు సమాచార సేకరణలో నిఘా వర్గాల వైఫల్యం వుందనే విమర్శలు వస్తున్నాయి. గిరిజనుల రిజర్వేషన్ల అంశంపై కొద్ది నెెలలుగా ఆదివాసీలు, లంబాడీల మధ్య కొనసాగుతున్న వైరుధ్యం, మాటల యుద్దం నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాలలో భద్రతను పటిష్టం చేసే విషయంలో పోలీసులు కూడా ముందు చూపుతో వ్యవహరించలేదనే ఆరోపణలు రాసాగాయి. ఇదే సమయంలో శుక్రవారం నాటి ఘర్షణలకు ముందు బుధ, గురువారాల్లో ఉట్నూరు, హస్నాపూర్‌లలో జరిగిన వరుస ఘటనలపైనా నిఘా వర్గాలతో పాటు పోలీసులు వివరాలు సేకరించి తగిన ఏర్పాట్లు చేయడంలో వైఫల్యం చెందారని అంటున్నారు.