నిగారింపుగా చర్మం

FACE
Beautiful Skin

నిగారింపుగా చర్మం

 

అరటిపండు గుజ్జు లేదా బొప్పాయి గుజ్జులో ముల్తాని మట్టి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగితే చర్మం మృదువుగా తయారవుతుంది.
పెరుగులో ఆరెంజి జ్యూస్‌ లేదా తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని ఆరిన తర్వాత శుభ్రపరచుకోవాలి.

ప్రతిరోజూ ఈవిధంగా చేస్తే చర్మానికి మంచి నిగారింపు వస్తుంది

క్యారెట్‌ జ్యూస్‌ను ముఖంపై రాసుకుని వేళ్లతో వలయాలుగా చుడుతూ మసాజ్‌ చేసుకోవాలి.
ఈ జ్యూస్‌ మంచి స్క్రబ్‌గా ఉపయోగపడుతుంది.
టమాట లోపలి గుజ్జు అంతా తీసి చర్మంపై రబ్‌ చేసుకోవాలి. ఇది మంచి స్క్రబ్‌గా ఉపయోగపడుతుంది.

ఉడకపెట్టిన క్యాబేజీని మిక్సీలో వేసి మెత్తని గుజ్జులా చేసుకోవాలి. దానిలో తేనె, శనగపిండి కలపాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేయాలి. వారానికి మూడుసార్లు ఈవిధంగా చేస్తే చర్మం కాంతివంతంగా అవ్ఞతుంది.

నాలుగు బాదం పలుకులు పాలలో రాత్రివేళ నానపెట్టి మర్నాడు మెత్తని పేస్టులా చేసుకోవాలి.
ఈ మాస్క్‌ ముఖానికి వేసుకుని ఆరిన తర్వాత కడుక్కోవాలి. పొడిచర్మం కలవారికి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది.