నిఖిల్‌ సరసన బన్నీ హీరోయిన్‌

catherin
catherin

వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్‌ హీరో నిఖిల్‌ ప్రస్తుతం ‘కిరిక్‌ పార్టీ అనే సినిమాలో నటిస్తున్నారు.. కన్నడ సూపర్‌హిట్‌ సినిమా కిరిక్‌ పార్టీకి ఇది రీమేక్‌.. ఇది కాకుండా ఈనెల 19న ఆయన మరొక కొత్తసినిమాను లాంచ్‌ చేయనున్నారు.. అది కూడ రీమేక్‌ కావటం విశేషం.. తమిళ హిట్‌ చిత్రం కనితన్‌ దీనికి మాతృక.. సినీవర్గాల్లో విన్పిస్తున్న కథనం ప్రకారం ఈచిత్రంలో నిఖిల్‌ సరసన యంగ్‌ బ్యూటీ , అల్లు అర్జున్‌తో ఇద్దరమ్మాయిలు,సరైనోడు వంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న కేథరిన్‌ థ్రెస్సా హీరోయిన్‌గా నటించే అవకాశ ముందని తెలుస్తోంది.. అయితే అధికారికరంగా ఏవిధమైన ప్రకటన వెలువడలేదు. అప్పటి వరకు వేచిచూడాల్సిందే. మరి.