నిఖిల్ ‘కిర్రాక్ పార్టీ’

నిఖిల్ ‘కిర్రాక్ పార్టీ’
నిఖిల్ హీరోగా కన్నడ సూపర్‌హిట్ సినిమా ‘కిరిక్ పార్టీని ప్రముఖ నిర్మాణ సంస్థ ఎకె ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తెలుగులో ‘కిర్రాక్ పార్టీ గా రూపొందిస్తున్న విసయం తెలిసిందే.. నిఖిల్ సరసన సంయుక్త హెగ్డే, సిమ్రాన్ పరింజా హీరోయిన్లుగా నటిస్తున్న ఈచిత్రం ద్వారా శరణ్ కొప్పిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.. సుధీర్ వర్మ స్క్రీన్‌ప్లే, చందూ మొండేటి సంభాషణలు సమకూరుస్తున్నారు. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈచిత్రం వచ్చేఏడాది ఫిబ్రవరి 9న విడుదల కాబోతోంది. నిర్మాతలు మాట్లాడుతూ, నిఖిల్ మాచో లుక్ సినిమాపై అంచనాలు పెంచాయన్నారు. హ్యాడీపేడ్ తర్వాత తెలుగలో కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈచిత్రం యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా నిలుస్తుందన్నారు. ఫిబ్రవిరి 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.