నిండుకుండ‌లా నందికొండ‌

Nagarjuna sagar
Nagarjuna sagar

నందికొండ : నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590అడుగులకు గాను ప్రసుత్తం 582(581.60) అడుగుల వద్ద 287.6290 టీఎంసీల నీరు నిల్వ వుంది. శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం నుంచి 73,422క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. ఎడమకాల్వ ద్వారా 6097క్యూసెక్కులు, కుడికాల్వ ద్వారా 3144 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2400క్యూసెక్కులు, డీటీ (డైవర్షన్ టన్నెల్) గేట్ల ద్వారా 10క్యూసెక్కులతో మొత్తం 11,651క్యూసెక్కుల అవుట్‌ఫ్లో విడుదలవుతున్నది.