నా వ్యాఖ్యలను బలపరిచే పార్టీకే మద్దతు

kamalhassan
kamalhassan

చెన్నై: నా వ్యాఖ్యలను బలపరిచే పార్టీకే నా మద్దతు అని నటుడు కమల్‌హాసన్‌ అన్నారు. మీడియాతో కమల్ హాసన్ మాట్లాడుతూ… తమిళనాడును ఉన్నతంగా చూడాలన్నదే నా ఆశయమని కమల్‌హాసన్‌ అన్నారు. డీఎంకే బలపరిచినా.. ఏఐఏడీఎంకే బలపరిచినా మద్దతిస్తానన్నారు. అవినీతి జరిగినప్పుడు సీఎం రాజీనామా చేయాలని పార్టీలు డిమాండ్‌ చేస్తాయన్నారు. తమిళనాడులో ఎక్కువ అవినీతి జరిగినా ఏ పార్టీ సీఎం రాజీనామా అడగలేదన్నారు.