నా రిటైర్మెంట్‌ ఇప్పుడు కాదు

jack maa
jack maa

బీజింగ్‌: గత శనివారం చైనా ఇ-కామర్స్‌ దిగ్గజా అలీబాబా సహ వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌ జాక్‌ మా పదవీ విరమణపై ఆ సంస్థ స్పష్టతనిచ్చింది. జాక్‌ మా రిటైర్మెంట్‌ నేడు కాదని ..వచ్చే ఏడాది ఇదే రోజు వరకు జాక్‌ మా ఛైర్మన్‌గా కొనసాగుతారని ఆలీబాబా తెలిపింది. ‘కంపెనీ అవసరాల కొసం మరో ఏడాది పాటు కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా కొనసాగుతాను. 2020 వరకు అలీబాబా బోర్డు డైరెక్టర్‌గా ఉంటాను అని కంపెనీ పత్రిక సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్టుకు రాసిన లేఖలో జాక్‌ మా తెలిపారు.