నా మాటలను వక్రీకరించారు: ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌

Srinivas goud
Srinivas goud

హైదరాబాద్‌: ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను వ్యాఖ్యలు చేసినట్లు వస్తున్న కథనాలు నిజం లేవని, తన మాటలను వక్రీకరించారని ఎమ్మెల్యే శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. సీఎం కెసిఆర్‌ అందరికీ న్యాయం చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్త చేశారు. ఎన్నికలు సమీపిస్తున్నాయంటే కాంగ్రెస్‌ నేతలకు అందరూ గుర్తుకు వస్తారని శ్రీనివాస్‌ గౌడ్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ హయంలో హైదరాబాద్‌లో కల్లును నిషేధించారని, గౌడ వృత్తిదారులను కాంగ్రెస్‌ నేతలు ఎప్పుడైనా పట్టించుకున్నారా? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం బిసి సంక్షేమానికి కట్టుబడి ఉందని శ్రీనివాస్‌ గౌడ్‌ స్పష్టం చేశారు.